Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహేష్ బాబు సోదరిగా బాలీవుడ్ హీరోయిన్!

Advertiesment
మహేష్ బాబు సోదరిగా బాలీవుడ్ హీరోయిన్!
, గురువారం, 17 సెప్టెంబరు 2020 (09:22 IST)
ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం "సర్కారు వారి పాట'. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయి. నవంబరు నుంచి సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈలోపు ఈ చిత్రంలో నటించే నటీనటుల ఎంపికను పూర్తి చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. 
 
అయితే, ఈ చిత్ర కథ బ్యాంకింగ్‌ రంగంలో మోసాలు, వాటిని సంస్కరించే ఓ యువకుడి నేపథ్యంలో సాగనుంది. ఇందులో కథకు కీలకమైన హీరో సోదరి పాత్ర ఒకటి ఉందట! విద్యా బాలన్‌ ఆ పాత్రలో నటిస్తే బావుంటుందని దర్శక - నిర్మాతలు భావిస్తున్నారట. త్వరలో ఆమెను కలిసి కథ, అందులో పాత్ర ప్రాముఖ్యం వివరించాలని అనుకుంటున్నారట. అలాగే, విలన్‌గా అనిల్‌ కపూర్‌ పేరు పరిశీలనలో ఉన్నట్టు వినికిడి. వీటిపై క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన అల్లు అర్జున్.. కేసు నమోదుకు ఫిర్యాదు!