Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Hansika : విడాకుల దిశగా హన్సిక అడుగులు వేస్తుందా !

Advertiesment
Hansika Motwani

దేవీ

, మంగళవారం, 12 ఆగస్టు 2025 (11:05 IST)
Hansika Motwani
హన్సిన తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ కు తను విడాకులు తీసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇటీవలే ఆమె పెట్టిన పోస్ట్ అందుకు కారణమైంది. తన పుట్టినరోజు నాడు వేడుక చేసుకున్నాక ఆమె పోస్ట్ సారాంశం ఏమంటే.. 2025 తనకెంతో పాఠాలు నేర్పింది. నాలో నాకు తెలీనంతగా బలం వుందని తెలియజేసింది. మీ అందరి శుభాకాంక్షలతో నా హ్రుదం ఉపొంగిపోయింది. ఒక్కోసారి చిన్న విషయాలు కూడా ఆనందించేలా వుంటాయి అంది. 
 
ఆగస్టు 9, శనివారం హన్సిక 34 ఏళ్లు నిండాయి. సోహేల్ ఖతురియాతో తన వివాహం చుట్టూ తిరుగుతున్న విడాకుల పుకార్ల మధ్య, జీవిత పాఠాలు నేర్చుకోవడం గురించి ఒక నిగూఢ పోస్ట్‌ను పంచుకోవడం ద్వారా నటి తన పుట్టినరోజును జరుపుకుంది. ప్రశాంతమైన సముద్ర దృశ్యం నేపథ్యంలో, హన్సిక ఇలా రాసింది, "వినయంగా మరియు కృతజ్ఞతతో నిండి ఉంది. ప్రేమలో చుట్టబడి, కేక్‌తో అలంకరించబడి, ప్రతి చిన్న క్షణానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను." ఆమె ఇంకా ఇలా రాసింది, "ఈ సంవత్సరం నేను అడగని పాఠాలను... మరియు నాకు తెలియని బలాన్ని తెచ్చింది. హృదయం నిండిపోయింది. ఫోన్ నిండిపోయింది. ఆత్మ ప్రశాంతంగా ఉంది." అని పోస్ట్ చేసింది.
 
బాలీవుడ్ కథనాలప్రకారం, హన్సిక,  ఆమె భర్త వివాహం చేసుకున్న రెండు సంవత్సరాల తర్వాత విడివిడిగా జీవిస్తున్నారని సూచించింది. నటి తన తల్లితో తిరిగి వెళ్లిపోయిందని సమాచారం. ఇక ఆమె చేసిన పోస్ట్ కు రూమర్స్ రావడానికి మరో కారణం కూడా తన పెండ్లి చేసుకున్న ఫొటోలు డిలీట్ చేసుకుంది. దానితో భర్తతో ఏదో తేడా వుందనేలా నెటిజన్లకు అర్థమయింది. ఇక సినిమా పరంగా చూస్తే, ఆర్. కన్నన్ దర్శకత్వంలో శ్రీగాంధారి అనే సినిమాలో నటిస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చెత్త సినిమాలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు : అనుపమ