Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రేప్ చేయబోయిన డ్రైవర్‌నే తిరిగి పనిలో పెట్టుకున్న రేష్మి? ఎందుకు?

బుల్లితెర యాంకర్ రేష్మి గురించి పెద్దగా పరిచయం చేయనక్కర్లేదు. జబర్దస్త్ షోతో బాగా ఫేమస్ అయిన రేష్మి ఆ తరువాత సినిమాల్లో కూడా నటించింది. అంతేకాదు వరుస ఆఫర్లతో ఇప్పుడు ముందుకు దూసుకెళుతోంది. బుల్లితెరకు పరిచయం కాకముందు రేష్మి ఎన్నో బాధలు పడ్డారట. తినడా

రేప్ చేయబోయిన డ్రైవర్‌నే తిరిగి పనిలో పెట్టుకున్న రేష్మి? ఎందుకు?
, గురువారం, 22 ఫిబ్రవరి 2018 (17:19 IST)
బుల్లితెర యాంకర్ రేష్మి గురించి పెద్దగా పరిచయం చేయనక్కర్లేదు. జబర్దస్త్ షోతో బాగా ఫేమస్ అయిన రేష్మి ఆ తరువాత సినిమాల్లో కూడా నటించింది. అంతేకాదు వరుస ఆఫర్లతో ఇప్పుడు ముందుకు దూసుకెళుతోంది. బుల్లితెరకు పరిచయం కాకముందు రేష్మి ఎన్నో బాధలు పడ్డారట. తినడానికి తిండి లేక తల్లి అనారోగ్యంతో ఉంటే ఆసుపత్రికి తీసుకెళ్ళలేక నరకయాతనను అనుభవించారట. అయితే కొన్నిరోజుల తరువాత జబర్దస్త్‌లో అవకాశం రావడం ఆ తరువాత సినిమాల్లోను మెల్లగా నిలదొక్కుకోవడంతో రేష్మి సమస్యలు కాస్త తీరాయట.
 
కానీ కొన్నినెలల క్రితం మాత్రం ఒక సినిమా షూటింగ్‌కు నంద్యాలకు వెళ్ళేటప్పుడు ఆమె కారు డ్రైవర్ అత్యాచార యత్నానికి ప్రయత్నించాడట. దీంతో రేష్మి గట్టిగా కేకలు పెట్టడంతో డ్రైవర్ కారు దిగి వెళ్ళిపోయాడట. ఆ తరువాత  కొన్నిరోజుల క్రితం తిరిగి ఆ కారు డ్రైవరే కనిపించి రేష్మిని ఉద్యోగం అడిగారట. 
 
తన భార్యకు బాగా లేదని, అనారోగ్యంతో ఉందని, మీరు దయతలిస్తే కానీ నా పరిస్థితి బాగుండదని చెప్పాడట. దీంతో రేష్మి మనస్సు కరిగిపోయి అతన్నే డ్రైవర్‌గా పెట్టుకోవడంతో పాటు లక్ష రూపాయల డబ్బులు కూడా ఇచ్చిందట. కష్టం గురించి తెలిసి మరో వ్యక్తి కష్టపడకుండా ఉండేందుకు రేష్మి చేసిన సహాయంపై అందరూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరణ్ జోహార్‌తో కోల్డ్ వారా? ప్రభాస్ అంత అడిగాడా? అసలేం జరుగుతోంది?