బొమ్మరిల్లు సినిమా హీరో సిద్దార్థ్ గురించి తెలియని యూత్ వుండడు. ఆ సినిమా పేరుతో చాలా ఆఫర్లు సంపాదించాడు. అంతకుముందు కూడా మంచి సినిమాలు చేశాడు. కానీ ఆ తర్వాత ఎందుకనే ఆయనకు సరైన అవకాశాలు రాలేదు. దాంతో బాలీవుడ్, కోలీవుడ్‌లో తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. మల్టీటాలెంటెడ్ సిద్దార్థ్. ఆయనతో ఆయన స్నేహితుడు దర్శకుడు శంకర్ శిష్యుడు తీసిన సినిమా టక్కర్. ఈ సినిమా కరోనా టైంలో తీశారు. అది ఎట్టకేలకు ఈనెల 9న విడుదలకాబోతుంది.
కాగా, తెలుగులో ఇంత గేప్ రావడానికి కారణాన్ని చెబుతూ, నాకు వచ్చే కథలన్నీ యాక్షన్ సినిమాలే. కథలో నేను అవతలివాడిని ఎందుకు కొడతానే నాకే తెలీదు. అలాంటి కథలు పట్టుకుని చాలామంది వచ్చారు. అలా చాలా కథలు వచ్చాయి. ఒకరకంగా లవర్‌బాయ్ కథలు విని విసిగిపోయాను. ఒక దశలో కొందరు ప్రముఖులు కూడా ఎందుకు తెలుగులో చేయడంలేదు అని చాలామందిఅడిగారట. కానీ విషయం ఏమంటే ఎవరో కొందరు సిద్దార్థ్‌ను తొక్కేందుకు ప్రయత్నిస్తున్నారట. వారు ఎరనేది చెప్పలేదు. తనకు కథలు చెప్పడానికి వచ్చిన వారినుంచి తీసుకున్న ఫీడ్ బ్యాక్‌తో ఇదంతా అర్థమయింది అన్నట్లుగా చెప్పాడట.