Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'నీలి చిత్రం'లాంటి సినిమాలో నటించేందుకు సిద్ధపడ్డా... కంగనా రనౌత్

తాను బాలీవుడ్ వెండితెరకు వచ్చిన కొత్తల్లో నీలి చిత్రంలాంటి సినిమాల్లో నటించేందుకు సైతం సిద్ధపడినట్టు బాలీవుడ్ భామ కంగనా రనౌత్ వెల్లడించారు. ఈ భామ ఇటీవలే ఓ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. చిత్ర

Advertiesment
'నీలి చిత్రం'లాంటి సినిమాలో నటించేందుకు సిద్ధపడ్డా... కంగనా రనౌత్
, సోమవారం, 2 జనవరి 2017 (12:59 IST)
తాను బాలీవుడ్ వెండితెరకు వచ్చిన కొత్తల్లో నీలి చిత్రంలాంటి సినిమాల్లో నటించేందుకు సైతం సిద్ధపడినట్టు బాలీవుడ్ భామ కంగనా రనౌత్ వెల్లడించారు. ఈ భామ ఇటీవలే ఓ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. చిత్ర పరిశ్రమకు వచ్చే ప్రతి హీరోయిన్‌ను దర్శకనిర్మాతలు హీరోలు తెగ వాడేసుకుంటారనీ, ఇలాంటి వారిలో తాను ఓ బాధితురాలినని బహిరంగంగా ప్రకటించిన విషయం తెల్సిందే. 
 
తాజాగా మరో బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చింది. 2006లో 'గ్యాంగ్ స్టర్' సినిమాతో బాలీవుడ్‌లోకి కంగనా ఎంట్రీ ఇచ్చానని, దీనికి ముందు తనకు మరో సినిమా ఆఫర్ వచ్చినట్టు చెప్పింది. అది ఏమంత మంచి సినిమా కాకపోయినా... అప్పుడున్న పరిస్థితుల్లో ఆ సినిమాను ఒప్పుకోవాల్సి వచ్చిందని... ఫొటో షూట్ కూడా చేశారని తెలిపింది. 
 
ఆతర్వాత తనకు ఇచ్చిన కాస్ట్యూమ్ రోబ్‌లో దుస్తులేమీ లేవని... తాను నటించబోయేది నీలి చిత్రంలా ఉన్నదని తెలిపింది. సరిగ్గా అదేసమయంలో 'గ్యాంగ్ స్టర్' మూవీలో అవకాశం రావడంతో... ఈ ప్రాజెక్టును వదిలేశానని చెప్పింది. సదరు సినిమా నిర్మాత తనపై ఆగ్రహం కూడా వ్యక్తం చేశాడని తెలిపింది. అప్పట్లో తనకు 17, 18 ఏళ్ల వయసు ఉండేదని... అప్పుడున్న పరిస్థితుల్లో 'గ్యాంగ్ స్టర్' సినిమా రాకపోతే, ఖచ్చితంగా ఆ నీలిచిత్రంలాంటి చిత్రంలో నటించివుండేదాన్నని తెలిపింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బ్రహ్మానందంపై చలపతిరావు సైటైర్.. ఇతడి సర్వీస్ అయిపోయిందట కదా?