బ్రహ్మానందంపై చలపతిరావు సైటైర్.. ఇతడి సర్వీస్ అయిపోయిందట కదా?
హాస్యబ్రహ్మ, కామెడీ కింగ్ బ్రహ్మానందంపై చలపతిరావు వేసిన సెటైర్ ప్రస్తుతం నెట్‌లో హల్ చల్ చేస్తోంది. బ్రహ్మానందం టాలీవుడ్‌లో విడుదలయ్యే ప్రతి సినిమాలోనూ కనిపిస్తాడు. టాప్ హీరోలు కూడా బ్రహ్మానందం డేట్స్
హాస్యబ్రహ్మ, కామెడీ కింగ్ బ్రహ్మానందంపై చలపతిరావు వేసిన సెటైర్ ప్రస్తుతం నెట్‌లో హల్ చల్ చేస్తోంది. బ్రహ్మానందం టాలీవుడ్‌లో విడుదలయ్యే ప్రతి సినిమాలోనూ కనిపిస్తాడు. టాప్ హీరోలు కూడా బ్రహ్మానందం డేట్స్‌కు అనుగుణంగా తమ డేట్స్‌ను ఇచ్చేవారు.. బ్రహ్మీ హవా అంతా ఇంతా కాదు. అయితే సీన్ మారిపోయింది. బ్రహ్మీకి అవకాశాలు బాగా తగ్గిపోయాయి.
అయితే ఈ మధ్య విడుదలైన అల్లరి నరేష్ 'ఇంట్లో దెయ్యం నాకేం భయం' సినిమాలో బ్రహ్మానందం కనిపించాడు. రెండు సీన్లలో కనిపించినా తన సత్తా ఏంటో బ్రహ్మానందం చూపించారు. ఈ సినిమాలో వచ్చే ఒక సీన్‌లో పోలీసు ఆఫీసర్ పాత్రలో వచ్చిన బ్రహ్మానందాన్ని చూసి నటుడు చలపతి రావు ''ఇతడి సర్వీస్ అయిపోయిందట కదా'' అంటూ ఒక సెటైర్ డైలాగ్ వేస్తాడు. ఇందుకు బ్రహ్మానందం ''నేను ఐఫోన్ లాంటోడిని. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లతో కొత్తగా తయారవుతుంటా'' అంటూ రివర్స్ పంచ్ డైలాగ్ వేస్తాడు.
ఈ డైలాగ్ ను విన్న వెంటనే థియేటర్‌లోని ప్రేక్షకులు తెగ నవ్వుకున్నారు. ఇదే మూవీలో బ్రహ్మి జూనియర్ 'జనతా గ్యారేజ్' సినిమాను గుర్తుకు తెస్తూ ''ప్రతి బలహీనుడి వెనుక ఒక బలవంతుడు ఉంటాడు. పోలీస్ గ్యారేజ్'' అంటూ డైలాగ్ చెప్పి అదరగొట్టేశాడు. అయితే అల్లరి నరేష్‌కు మాత్రం ఈ సినిమా కూడా ఆశించిన స్థాయిలో గుర్తింపు సంపాదించిపెట్టలేకపోయిందని టాక్ వస్తోంది.