Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ధనుష్, మృణాల్ ఠాకూర్ డేటింగ్ పుకార్లు.. కారణం ఏంటంటే?

Advertiesment
Mrunal Thakur_Dhanush

సెల్వి

, సోమవారం, 24 నవంబరు 2025 (12:15 IST)
2025 సంవత్సరం ప్రారంభంలో ధనుష్, మృణాల్ ఠాకూర్ డేటింగ్ పుకార్లు వెలువడ్డాయి. ధనుష్ సోదరీమణులు ఇన్‌స్టాగ్రామ్‌లో మృణాల్‌ను అనుసరించడం ఈ ఊహాగానాలకు మరింత ఆజ్యం పోసింది. ధనుష్, మృణాల్ కలిసి పనిచేయనప్పటికీ వారిద్దరూ ప్రేమించుకుంటున్నారని కోలీవుడ్ కోడైకూస్తోంది. తాజాగా మళ్లీ వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందని సోషల్ మీడియాలో వార్తలు వెల్లువెత్తుతున్నాయి. 
 
నెలల తరబడి నిశ్శబ్దం తర్వాత, ధనుష్ ఇన్‌స్టాగ్రామ్‌లో మృణాల్ ఠాకూర్‌కు పోస్ట్ చేసిన సందేశం తర్వాత మళ్లీ ఈ వార్తలను నిజం చేసేలా వుంది. మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం బాలీవుడ్ నటుడు సిద్ధాంత్ చతుర్వేదితో కలిసి రొమాంటిక్ డ్రామా దో దీవానే సెహెర్ మేలో స్క్రీన్ స్పేస్‌ను పంచుకుంటున్నారు.
 
టైటిల్ రివీల్ టీజర్‌ను కూడా మేకర్స్ పంచుకున్నారు. టీజర్‌పై ధనుష్ స్పందిస్తూ, "చూడటానికి, వినడానికి బాగుంది.. అని రాశారు. సాధారణంగా, ధనుష్ సినిమా ప్రకటనలు లేదా ఇతర నటుల టీజర్ విడుదలలపై వ్యాఖ్యానించరు. కాబట్టి, మృణాల్ ఠాకూర్ టీజర్‌పై అతని స్పందన మరోసారి డేటింగ్ పుకార్లు నిజమే కావచ్చనే చర్చకు దారితీసింది.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Chiru: నయనతార గైర్హాజరు - అనిల్ రావిపూడికి వాచ్ ని బహూకరించిన చిరంజీవి