Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తమ్ముడితో సెటిల్ చేస్తా.. మరి నాకేంటి అని అన్నయ్య అడిగారు? శ్రీసుధ

Advertiesment
srisudha bhimireddy

ఠాగూర్

, గురువారం, 23 జనవరి 2025 (17:09 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన నటి శ్రీసుధ భీమిరెడ్డి. ఫ్రెండ్స్ రోల్స్, వాంప్ తరహా  రోల్స్ చేస్తూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. వైద్య విద్యను పూర్తి చేసిన ఈమె యాక్టర్ అయ్యారు. మంచి హైట్‌తో పాటు పర్సనాలిటీ ఆమె సొంతం. పైగా, అందచందాలు కుర్రకారుకు సెగలు పుట్టించేలా ఉంటాయి. అయితే, తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఇపుడు చిత్రపరిశ్రమలో సంచలనంగా మారాయి. 
 
మాజీ ఫిజియోథెరపిస్ట్ అయిన శ్రీసుధ.. కొద్ది రోజుల క్రితం విమానంలో ప్రయాణిస్తుండగా తనపట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఓ ప్రయాణికుడి చెంప ఛెళ్లుమనిపించారు. పైగా, అతను ఎంతలా ఇబ్బంది పెట్టాడో వివరిస్తూ ఓ వీడియోను కూడా పోస్ట్ చేసింది. ఇపుడు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటా కె. నాయుడు తమ్ముడు శ్యామ్ కె. నాయుడు తనను పెళ్లి పేరుతో మోసం చేశారంటూ శ్రీసుధ సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఇదే విషయంపై ఆమె ఏకంగా పోలీస్ స్టేషన్‌లో సైతం ఫిర్యాదు చేశారు. 
 
అయితే, ఈ కేసు పెట్టిన తర్వాత శ్యామ్ పై కేసును విత్ డ్రా చేసుకోవాలని సినీ పెద్దలు ఒత్తిడి చేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే విషయాన్ని ఆయన అన్నయ్య చోటా కె. నాయుడు దృష్టికి తీసుకెళితో.. నా తమ్ముడుతో ఉన్న సమస్యను సెటిల్ చేస్తా... మరి నాకేంటి అని అడిగేసరికి ఏం మాట్లాడాలో తెలియలేదన్నారు. గత 2014 నుంచి ఇప్పటివరకు దాదాపు పదేళ్లుగా శ్యామ్‌తో గొడవ జరుగుతోందని పేర్కొన్నారు. ప్రస్తుతం శ్రీసుధ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హృదయాలను హత్తుకునేలా గాంధీ తాత చెట్టు - రివ్యూ