Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర చిత్రంలో ఆషికా రంగనాథ్‌ ఎంట్రీ

Aashika Ranganath

డీవీ

, శుక్రవారం, 24 మే 2024 (15:23 IST)
Aashika Ranganath
మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ మాగ్నమ్ ఓపస్ 'విశ్వంభర'. వశిష్ట దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ UV క్రియేషన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మెగా అభిమానులకు, సినీ అభిమానులకు చిరస్మరణీయమైన చిత్రాన్ని నిర్మించే అవకాశాన్ని వశిష్ట అద్భుతంగా వినియోగించుకుంటుండగా, యువి క్రియేషన్స్ రాజీపడకుండా భారీ కాన్వాస్‌పై సినిమాను నిర్మిస్తోంది.
 
తాజాగా మైటీ 'విశ్వంభర' టీం, ఛార్మింగ్ ఆషికా రంగనాథ్‌ను విశ్వంభర ఎపిక్ సినిమాటిక్ జర్నీకి స్వాగతించింది. నా సామి రంగాలో తన అద్భుతమైన లుక్స్, నటనతో అందరినీ ఆకట్టుకున్న ఆషికాఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను పోషించనున్నారు. 
 
మరికొందరు ప్రముఖ నటీనటులు ప్రముఖ పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన ఏజ్ లెస్ దివా త్రిష కృష్ణన్ హీరోయిన్‌గా నటిస్తోంది.
 
విక్రమ్, వంశీ, ప్రమోద్ ఈ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్‌ని నిర్మిస్తున్నారు. ఆస్కార్ అవార్డు విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందించగా, ప్రముఖ డీవోపీ చోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు.
 విశ్వంభర 2025 సంక్రాంతికి జనవరి 10న విడుదల కానుంది.
 
తారాగణం: మెగాస్టార్ చిరంజీవి, త్రిష కృష్ణన్, ఆషికా రంగనాథ్
 సాంకేతిక సిబ్బంది:రచన, దర్శకత్వం: వశిష్ట, నిర్మాతలు: విక్రమ్, వంశీ, ప్రమోద్, బ్యానర్: యువి క్రియేషన్స్, సంగీతం: ఎంఎం కీరవాణి, డీవోపీ: చోటా కె నాయుడు, ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్
ఫైట్స్: రామ్-లక్ష్మణ్

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Cannes 2024: రెడ్ కార్పెట్‌లో మెరిసిన అదితి రావ్ హైదరీ