Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అనుష్క ఆ డైరెక్ట‌ర్‌తో సినిమా చేస్తుందా..?

Advertiesment
అనుష్క ఆ డైరెక్ట‌ర్‌తో సినిమా చేస్తుందా..?
, మంగళవారం, 4 డిశెంబరు 2018 (15:00 IST)
అరుంధ‌తి, బాహుబ‌లి, భాగ‌మ‌తి.. ఇలా వైవిధ్య‌మైన చిత్రాల్లో న‌టిస్తూ.. ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్న అందాల భామ అనుష్క‌. భాగ‌మ‌తి సినిమా త‌ర్వాత అనుష్క ఇప్ప‌టి వ‌ర‌కు ఏ సినిమాని అంగీక‌రించ‌లేదు. అయితే... మాధ‌వ‌న్‌తో క‌లిసి అనుష్క ఓ సినిమా చేస్తుంద‌ని... ఈ చిత్రాన్ని కోన వెంక‌ట్, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంయుక్తంగా నిర్మించ‌నున్నాయి అని వార్త‌లు వ‌చ్చాయి. ఈ చిత్రానికి సైలెన్స్ అనే టైటిల్ ఖ‌రారు చేసిన‌ట్టు తెలిసింది. 
 
తాజాగా అనుష్క మ‌రో డైరెక్ట‌ర్‌కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ట‌. ఇంత‌కీ ఎవ‌రికంటారా..? చంద్రశేఖర్ ఏలేటికి అని టాక్. ఆయ‌న‌ ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ చేయ‌నున్నార‌ట‌. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ‌ నిర్మించబోతున్న ఈ సినిమా కోసం దర్శకుడు చంద్రశేఖర్ ఓ కథ వినిపించగా అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని తెలిసింది. ఈ సినిమాలో అనుష్క ఎలా క‌నిపించ‌నున్న‌దో అనేది ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫ్లోరింగ్ కింద కూడా సీలింగ్ ఫ్యాన్ బిగించగలను...