Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సల్మాన్ ఖాన్- అమీషా పటేల్ పెళ్లి చేసుకుని.. పిల్లలు కంటున్నారా?

Advertiesment
Ameesha Patel

సెల్వి

, శుక్రవారం, 31 జనవరి 2025 (16:36 IST)
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ తో తన పెళ్లికి సంబంధించి అభిమానుల మదిలో తలెత్తుతున్న ప్రశ్నలకు హీరోయిన్ అమీషా పటేల్ సమాధానమిచ్చింది. ట్విట్టర్ లో కొందరు అభిమానులు సల్మాన్ ను పెళ్లి చేసుకుని అందమైన పిల్లలను కనాలని చెప్పారని అమీషా తెలిపింది. 
 
తాజాగా ఓ ఇంటర్వ్యూలో అమీషా పటేల్ అభిమానుల కోరికల గురించి కొన్న విషయాలను చెప్పుకొచ్చింది. సల్మాన్ ఖాన్ ను పెళ్లి చేసుకుని అందమైన పిల్లలను కనండి అంటూ అడిగిన ప్రశ్నకు అనుకున్నది నిజమే. అందమైన వ్యక్తులు కలిసి ఉండటం కూడా ప్రపంచం ఇష్టపడుతుందని తాను భావిస్తున్నానని తెలిపింది.  
 
అంతేకాకుండా అమీషా, సల్మాన్ ఇద్దరూ ఇంకా పెళ్లి చేసుకోలేదని ఓ అభిమాని ఎగతాళి చేసి మాట్లాడాడని తెలిపారు. అయితే  ఆ అభిమాని ప్రశ్నకు సమాధానం చెప్తూ వారిద్దరూ పెళ్లి చేసుకునే ఛాన్స్ ఉందా అని సదరు అభిమానిని సరాదాగా అడిగినట్లు చెప్పింది. సినిమాలకు అదంతా పరిమితం. నిజ జీవితానికి చాలా తేడా వుంటుందని తెలిపింది. 
 
సల్మాన్ మరియు అమీషా 2002లో యే హై జల్వా అనే సినిమాలో కలిసి పనిచేశారు. బాలీవుడ్ హంగామాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఆ సినిమా ఫ్లాప్ కావడానికి కారణం మరెవరో కాదు సల్మాన్ అని అమీషా ఒకసారి పంచుకుంది. 
 
సల్మాన్ హిట్ అండ్ రన్ కేసు కారణంగానే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేకపోయిందని ఆమె అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టాలీవుడ్ నిర్మాత వేదరాజు టింబర్ మృతి