Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అప్పుడు హేళన చేసి ఇప్పుడు చిరంజీవి దయాదాక్షిణ్యాలు ఆశిస్తున్న అలీ ?

Comedian Ali

డీవీ

, శనివారం, 13 జులై 2024 (11:52 IST)
Comedian Ali
అంతా అయిపోయింది. అలీ శకం ముగిసింది. అంటూ తెలుగు చలన చిత్రరంగంలో కొందరు నటుడు అలీ గురించి విశ్లేషిస్తున్నారు. రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్లు ఇటీవలే ఓ వీడియోలో ప్రకటించిన అలీకి ప్రస్తుతం సినిమారంగంలో ఎవరినుంచి సరైన సపోర్ట్ లేదు. నటుడిగా అవకాశాలు లేవు. టీవీ కార్యక్రమాల్లో ప్రోగ్రామ్స్ లేవు. ఇదంతా కేవలం తను గతంలో వై.సి.పి. కి అండగా నిలవడం కారణంకాదు. అలీ చేసిన అవహేళన పెద్ద అవమానంగా ఇండస్ట్రీ భావిస్తోంది.
 
వివరాల్లోకి  వెళితే..  వై.ఎస్. జగన్‌కు వంతపాడడం ఒక ఎత్తయితే.. చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబుతో పాటు పలువురిని హేళన చేయడం అలీకి మరింత ఇరకాటంలోకెి నెట్టింది. ఈ విషయమై ప్రముఖ నిర్మాత, పంపిణీదారుడు అలీ శకం ముగిసిందా? అన్న ప్రశ్నకు నట్టికుమార్ మాట్లాడుతూ, సినిమారంగంలో టాలెంట్ వుంటే ఎప్పుడైనా అవకాశాలు వస్తాయి. కానీ తనకు అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించిన మెగాస్టార్ ఫ్యామిలీని ఖాతరు చేయని అలీకి ఎందుకు అవకాశాలు ఇవ్వాలని ప్రశ్నిస్తున్నారు.
 
ఇక జగన్ హాయంలో ఇండస్ట్రీ పెద్దలు చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబుతోపాటు పలువురు జగన్ పిలుపుమేరకు సినిమా సమస్యలు గురించి చర్చించడానికి విజయవాడ వెళితే, అక్కడ అరకిలోమీటరు అందరినీ నడిచి రమ్మన్నాడు జగన్. ఆయన కోరికమేరకు వారంతా నడుచుకుంటూ వెళుతుంటే ఆ టైంలో పైనుండి చూస్తున్న అలీ ఓ నవ్వు నవ్వాడు. ఆ నవ్వుకు అర్థం వేరే చెప్పనవసరంలేదు. అదీకాకుండా మధ్యాహ్నం  రెండుగంటల ముప్పై నిముషలవరకు వారు అక్కడే వున్నారు. కనీసం లంచ్ కూడా వారికి పెట్టలేదు. వారంతా వెనుదిరిగి వచ్చేశారు. వారిని జగన్ ఎందుకు పిలిచాడు? ఏమి చర్చించారో ఆ దేవుడికే తెలియాలి.
 
ఈ విషయాలు అలీకి తెలుసు. అప్పుడే గనుక ఇండస్ట్రీ పెద్దలకు జరిగిన అవమానం గురించి గ్రహించిన అలీ వెంటనే ఆ పార్టీకి రాజీనామా చేయడమో దూరంగా వుండడమో, లేదా కనీసం జగన్‌తో హీరోలను ఇంత ఇదిగా అవమానించడం సరైందని కాదని అడిగినా మరోరకంగా వుండేది. కానీ అలీ అలాచేయలేదు. తన స్వార్థం కోసం జగన్‌కు వత్తాసు పలికాడు. కారణం.. తర్వాత కూడా వైసి.పి. అధిక మెజారిటీతో వస్తుందని భ్రమలో వున్నారు. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యేసరికి.. చేసేది లేక.. రాజకీయాలకు దూరం అంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు.
 
అంతేకాదు. ఇటీవలే ఇద్దరు ప్రముఖులతో తన గురించి అలీ మాట్లాడించాడని తెలిసింది. చిరంజీవి కాళ్ల మీద పడతాను. పవన్ కళ్యాణ్‌ను క్షమించడమని అడుగుతానంటూ.. చెప్పిస్తున్నట్లు తెలిసింది. నాకు తెలిసి వారు ఒప్పుకున్నా అభిమానులు, పార్టీ కేడర్ మాత్రం ఒప్పుకోరు అంటూ నట్టికుమార్ తేల్చిచెపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దళపతి విజయ్ The GOAT నుంచి డ్యాన్స్ అంథమ్- విజిలేస్కో సాంగ్ రిలీజ్