Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అక్కినేని ఇంట్లో పెళ్లి బాజాలు.. అఖిల్‌కు డుం. డుం. డుం.. సమంత గ్రీన్ సిగ్నల్

Akhil_Nagarjuna

సెల్వి

, బుధవారం, 24 ఏప్రియల్ 2024 (10:42 IST)
అక్కినేని ఇంట్లో పెళ్లి బజాలు మోగనున్నాయని తెలుస్తోంది. అక్కినేని నాగార్జున రెండో తనయుడు అఖిల్ పెళ్లికి సిద్ధమవుతున్నాడని సమాచారం. అఖిల్ ఓ హీరోయిన్‌తో ప్రేమలో ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈక్రమంలోనే తమ ప్రేమ గురించి ఇరు కుటుంబాల్లో చెప్పడం వారు ఓకే చేయడం అన్నీ కూడా చక చక జరిగిపోయాయని తెలుస్తోంది. 
 
ఈ పెళ్లి వ్యవహారం అక్కినేని నాగార్జున, ఆయన మాజీ కోడలు సమంతకు కూడా తెలుసునని టాలీవుడ్ వర్గాల సమాచారం. అఖిల్ ప్రేమ వివాహానికి ఇద్దరూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. కాగా గతంలో శ్రీయ భూపాల్ అనే అమ్మాయిని ప్రేమించాడు అఖిల్. వీరిద్దరికి నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ నిశ్చితార్థంతో వారి బంధం చెడింది. ఆపై పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నారు. 
webdunia
Samantha
 
ఇక అఖిల్ కెరీర్ విషయానికి వస్తే..అఖిల్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరువాత అఖిల్ నటించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. బ్యాచ్‌లర్ సినిమానే యావరేజ్‌గా నిలిచింది. ఇక భారీ అంచనాల మధ్య విడుదలైన ఏజెంట్ సినిమా అట్టర్ ఫ్లాప్‌గా నిలిచింది. దీంతో సినిమాల నుంచి అఖిల్ కొంత గ్యాప్ తీసుకున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బలహీనమైన వారు స్త్రీలు అనే మూస భావనలను బద్దలు కొట్టే కథను దక్షిణాది ప్రేక్షకులు మెచ్చుకుంటారు