Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సమంత మరీ ఈవిధంగా గ్లామర్ షో చేస్తే ఇంకేమన్నా వుందా?

Samantha Ruth Prabhu

ఐవీఆర్

, గురువారం, 11 ఏప్రియల్ 2024 (14:58 IST)
కర్టెసి-ట్విట్టర్
సమంత రూత్ ప్రభు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఆమె ఒకరు. టాలీవుడ్ ఇండస్ట్రీలో సమంత సినిమాలు చేసినా చేయకపోయినా ఆమె గురించి మాత్రం డిస్కషన్స్ జరుగుతూనే వుంటాయి. తాజాగా ఆమె తన ఇన్ స్టాగ్రాంలో షేర్ చేసిన గ్లామర్ ఫోటోలకు ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.
 
సమంతకు నలుపు అంటే చాలా ఇష్టమట. అందుకే వీలున్నప్పుడల్లా నల్లటి దుస్తుల్లో గ్లామరస్ అందాలను ఆరబోస్తుంటుంది. ప్రస్తుతం ఆమె తన ఇన్ స్టాగ్రాంలో షేర్ చేసిన ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి. మరి ఏదయినా కొత్త సినిమా కోసం ఫోటో సెషన్ లో పాల్గొన్నదో ఏమో తెలియదు.
 
ఇదిలావుంటే ఈమధ్య అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా అతడికి విషెస్ చెప్పిందట సమంత. దీనితో అక్కినేని ఫ్యామిలీతో సంబంధాలను సమంత అలాగే కొనసాగిస్తోందని అనుకుంటున్నారు. ఆ సంబంధాలు అలాగే సాగితే కొన్నాళ్లకైనా తిరిగి చైతు-సమంత ఒక్కటవుతారేమోనని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శశివదనే చిత్రం విడుదలకు సిద్ధమైంది