Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫేస్‌బుక్ ప్రియుడితో పారిపోయింది, హత్య చేశారంటూ ఫోటోలు పంపించింది, ఆ తరువాత?

Advertiesment
ఫేస్‌బుక్ ప్రియుడితో పారిపోయింది, హత్య చేశారంటూ ఫోటోలు పంపించింది, ఆ తరువాత?
, సోమవారం, 24 ఫిబ్రవరి 2020 (14:33 IST)
తండ్రిపై కోపం ఆ యువతిని ప్రియుడితో పారిపోయేలా చేసింది. కష్టపడి తల్లిదండ్రులను, తమ్ముడిని తన జీతంతో కాపాడుతుంటే వారు మాత్రం సూటిపోటి మాటలు అనడం తట్టుకోలేకపోయింది. ప్రత్యామ్నాయంగా ప్రియుడు ఉండటంతో అతనికి దగ్గరైంది. అతనితో కలిసి పారిపోయింది. మళ్ళీ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లకూడదని నిర్ణయించుకుని ఒక ప్లాన్ వేసింది. చివరకు పోలీసులకు చిక్కింది.
 
విజయవాడ గాంధీనగర్‌కు చెందిన వెన్నెల స్థానికంగా ఉన్న ఒక ప్రభుత్వ కార్యాలయంలో కాంట్రాక్ట్ పద్ధతిలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తుండేది. ఆమె తండ్రి మహేందర్, తల్లి జ్యోతిలు. తండ్రి మహేందర్ అనారోగ్యంతో ఉండటం వల్ల ఇంటి దగ్గరే ఉండేవాడు. ఇక తమ్ముడు విక్రమ్ కూడా డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా తిరుగుతూ ఉండేవాడు.
 
మొత్తం కుటుంబం వెన్నెల జీతం మీదే నడిచేది. అయితే వెన్నెలకు ఫేస్‌బుక్ వాడటం ఎక్కువ ఇష్టం. ఆ ఇష్టంతోనే ఆమె వరంగల్‌కు చెందిన విశ్వతో బాగా కనెక్ట్ అయ్యింది. తన సమస్యలను అతనితో చెప్పుకునేంత క్లోజ్ అయ్యింది. ఆమె కోసం వరంగల్ నుంచి వారానికి ఒకసారి విశ్వ విజయవాడకు వచ్చి వెళ్లేవాడు.
 
విశ్వ ఎం.టెక్. పూర్తి చేసి ఖాళీగా ఉన్నాడు. ఖాళీగా ఉండటంతో వెన్నెలతో ఎక్కువసేపు ఫోన్లో మాట్లాడేవాడు. ఇలా వారి మధ్య పరిచయం బాగా పెరిగింది. అయితే జీతం తెచ్చిస్తున్నా తమ్ముడినే తండ్రి వెనకేసుకు రావడం.. వెన్నెలను హేళనగా మాట్లాడడం జీర్ణించుకోలేకపోయింది.
 
దీంతో వెన్నెల తన ప్రియుడిని ఒప్పించింది. తనను వరంగల్ తీసుకెళ్ళమని చెప్పింది. మూడురోజుల క్రితం ఇద్దరు వరంగల్‌కు వెళ్ళిపోయారు. అయితే వెన్నెల కనిపించకపోవడంతో అన్నిచోట్లా తిరిగి రెండురోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. 
 
పోలీసులకు ఫిర్యాదు చేసిన తరువాత వెన్నెలను ఎవరో హత్య చేసినట్లు ఆమె మొబైల్ నుంచి తండ్రికి ఫోటోలు వచ్చాయి. దీంతో షాకైన తల్లిదండ్రులు వాటిని పోలీసులకు చూపించారు. కానీ పోలీసుల విచారణలో అదంతా అబద్ధమని తెలిసింది. చివరకు ప్రియుడి ఇంట్లోనే ఆమె ఉండడం.. తల్లిదండ్రుల వద్దకు రానని చెప్పడంతో ఆమెకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినా మార్పు రాకపోవడంతో చివరకు పోలీసులు ఏమీ చేయలేకపోయారు. ప్రియుడిని మరో వారంరోజుల్లో వెన్నెల వివాహం చేసుకోబోతంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

3 కాదు 30 రాజధానులు పెట్టుకోండి.. జగన్‌పై తమ్మారెడ్డి భరద్వాజ సెటైర్లు