సైబర్ ముప్పుపై మహిళల రక్షణకు తగిన చర్యల రూపకల్పన కోసం పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.
హీరోయిన్ రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియోపై ఆందోళన వ్యక్తం చేసిన కల్వకుంట్ల కవిత.. సైబర్ ముప్పు నుంచి మహిళలను కాపాడాల్సిన తక్షణ అవసరం ఉందని స్పష్టం చేశారు.
సినీ హీరోయిన్ రష్మిక మందన్నపై దుండగులు డీప్ ఫేక్ వీడియోను సృష్టించడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సైబర్ ముప్పు నుంచి మహిళలను రక్షించాల్సిన తక్షణ అవసరం కేంద్ర ప్రభుత్వంపై ఉందని తెలిపారు.
రక్షణా చర్యలను సమగ్రంగా రూపొందించడం కోసం ప్రత్యేకంగా పార్లమెంటరీ స్థాయీ సంఘాన్ని ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను ఎక్స్ (ట్విట్టర్) ద్వారా కవిత విజ్ఞప్తి చేశారు.