తెలంగాణ రాష్ట్రంలో అధికార తెరాస పార్టీని చిత్తుగా ఓడించేంత వరకు విశ్రమించేది లేదని బీజేపీకి చెందిన నిజామాబాద్ ఎంపీ అరవింద్ అన్నారు. ఆయన గురువారం మాట్లాడుతూ, రాష్ట్రంలో దొంగ పాస్ పోర్టుల వ్యవహారం హిందువులను ఆందోళనలకు గురిచేస్తోందన్నారు.
రోహింగ్యాల పాస్ పోర్టు జారీకి నైతిక బాధ్యత వహిస్తూ పోలీస్ కమిషనర్ రాజీనామా చేయాలని ఆయన అన్నారు. ముస్లింల ఓట్ల శాతాన్ని పెంచేందుకే నిజామాబాద్ సీపీ కార్తికేయకు పోస్టింగ్ ఇచ్చారని ఆరోపించారు. ఆయనకు మరో చోటకు పదోన్నతి వచ్చినప్పటికీ కార్తికేయ నిజామాబాద్ జిల్లాను వదలడం లేదని చెప్పారు.
కాగా, తెలంగాణ కాంగ్రెస్‌లో కేసీఆర్ చెప్పినవాళ్లకే పీసీసీ అధ్యక్ష పదవి వస్తుందని ఆయన ఆరోపణలు గుప్పించారు. ఆ రెండు పార్టీలకు మధ్య సంబంధం ఉందని చెప్పుకొచ్చారు. పెద్దపల్లి జిల్లాలో జరిగిన అడ్వకేట్ వామన్ రావు దంపతుల హత్యను ఖండిస్తున్నామని తెలిపారు.
ఇదిలావుంటే, తెలంగాణాలో సంచలనం సృష్టించిన హైకోర్టు న్యాయవాదుల హత్యపై ఎఫ్ఐఆర్ నమోదైంది. మృతుడు వామన్‌రావు తండ్రి కిషన్‌రావు ఫిర్యాదుతో ముగ్గురిపై కుట్ర, హత్య అభియోగాల కింద పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
వామన్‌రావు దంపతుల హత్య కేసులో పోలీసులు.. ఏ1గా వెల్ది వసంతరావు, ఏ2గా కుంట శ్రీనివాస్, ఏ3గా అక్కపాక కుమార్‌ను చేర్చారు. ఐపీసీ 120బి, 302, 341, 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల వద్ద బుధవారం రోజు వామన్‌రావు దంపతులను గుర్తుతెలియని దుండగులు హత్య చేసిన విషయం లిసిందే. హైదరాబాద్ నుంచి కల్వచర్ల చేరుకున్న క్లూస్ టీం వివరాలు సేకరించింది.