తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాలు గురువారం (జూన్ 30) విడుదల కానున్నాయి. జూన్ 30 ఉదయం 11.30 గంటలకు జూబ్లీహిల్స్లోని ఎంసీఆర్‌హెఆర్డీలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పదవ తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేయనున్నారు, రిలీజ్ చేయనున్నారు.
ఇకపోతే... తెలంగాణ రాష్ట్రంలో మే 23 నుంచి జూన్ 1 వరకు పదో తరగతి వార్షిక పరీక్షలు జరిగాయి. దాదాపు 5లక్షలకుపైగా విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు.
కరోనా వల్ల విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభంకావడంతో సిలబస్‌ను 70శాతానికి కుదించి క్వశ్చన్ పేపర్ తయారు చేశారు. పరీక్ష పేపర్లను 11 నుంచి 6కు తగ్గించారు.
ఇక పరీక్షా ఫలితాలను విద్యార్థులు కింది వెబ్ సైట్లలో చెక్ చేసుకోవచ్చు.
https://bse.telangana.gov.in/
http://www.bseresults.telangana.gov.in/