Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణాలో ప్రపంచలోనే అతిపెద్ద టీ-హబ్ : నేడు ప్రారంభం

Advertiesment
t-hub
, మంగళవారం, 28 జూన్ 2022 (11:25 IST)
తెలంగాణా రాష్ట్రంలో మరో ఐటీ హబ్ అందుబాటులోకి రానుంది. అదీకూడా ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్ టీహబ్‌గా గుర్తింపుపొందింది. ఈ హబ్‌ను ఆ రాష్ట్ర ఐటీ శాఖామంత్రి కేటీఆర్‌తో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ప్రారంభిస్తారు. 
 
నగర శివారు ప్రాంతమైన రాయదుర్గం నాలెడ్జ్ సిటీల రూ.400 కోట్ల వ్యయంతో ఈ హబ్‌ను నిర్మించారు. మొత్తం మూడు ఎకరాల్లో 53.65 మీటర్ల ఎత్తులో నిర్మించిన ఈ భవనంలో మొత్తం అంతస్తులు ఉన్నాయి. 4 వేలకు పైగా సంస్థలు ఇందులో తమ కార్యకలాపాలు కొనసాగించేలా అన్ని వసతులు కల్పించారు. 
 
ఈ ఇంక్యుబేటర్ ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్ర ఐటీ శాఖ కూ యాప్‌తో ఒక అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకుంటుంది. అలాగే, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, హీరో మోటార్స్, ఫొంటాక్, వెబ్3 వంటి సంస్థలతో టీ హబ్ ఒప్పందాలు చేసుుకోనుంది. ఈ భవనం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని విద్యుద్దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మద్యం సేవించి స్టీరింగ్ పట్టుకుంటే మొండికేస్తుంది...