తెలంగాణలో క్రీడాకారులకు 1600 ఉద్యోగాలు లభించనున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ నిరుద్యోగులకు అసెంబ్లీ వేదికగా గుడ్ న్యూస్ చెప్పిన సంగతి తెలిసిందే.
బుధవారం సీఎం కేసీఆర్ ప్రకటించిన 83,039 ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడాకారులకు సుమారు 1,600 ఉద్యోగాలు లభిస్తాయని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ఎ.వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు.
"క్రీడాకారుల కోటా ప్రకారం, రెండు శాతం మేరకు నోటిఫికేషన్లలో సుమారు 1,600 ఉద్యోగాలు ఇవ్వబడతాయి. క్రీడాకారులు ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి" అని వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు.
అంతేగాకుండా 11,100 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులలో, కాంట్రాక్ట్ సిబ్బందిగా పనిచేస్తున్న దాదాపు 40 మంది క్రీడాకారుల సేవలను కూడా క్రమబద్ధీకరించనున్నట్లు స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ తెలిపారు. తమ క్రీడా విభాగాన్ని బలోపేతం చేయాలని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విభాగాలకు విజ్ఞప్తి చేస్తామని వెంకటేశ్వర్ రెడ్డి చెప్పారు.