Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కానిస్టేబులు కాదు.. కిరాతకుడు... లావుగా ఉన్నావంటూ వేధింపులు.. భార్య ఆత్మహత్య

Advertiesment
కానిస్టేబులు కాదు.. కిరాతకుడు... లావుగా ఉన్నావంటూ వేధింపులు.. భార్య ఆత్మహత్య
, గురువారం, 11 మార్చి 2021 (07:09 IST)
మహిళలకు రక్షణ కల్పించాన్సిన ఓ పోలీస్ కానిస్టేబులే కట్టుకున్న భార్య పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. లావుగా ఉన్నావంటూ నిత్యం వేధించసాగాడు. చిత్ర హింసలు పెట్టాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి లోనైన ఆ మహిళ.. బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్‌కు సమీపంలో వున్న దుందిగల్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, శ్రీలత అనే మహిళకు శివ కుమార్ అనే పోలీస్ కానిస్టేబుల్‌ను పెళ్లాడింది. ఈయన సనత్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. కొంత కాలంగా శ్రీలత లావుగా వుందనే కోపంతో చిత్రహింసలకు గురిచేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో భార్యకు భోజనం కూడా పెట్టేవాడు కాదు. 
 
కొన్ని నెలలు క్రితమే పూర్వ విద్యార్థుల గేట్‌టుగెదర్ కార్యక్రమం జరిగిన సమయంలో అక్కడ మరో వివాహిత శివ కుమార్‌కి పరిచయమైంది. దీంతో ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉందని శ్రీలతకు తెలిసింది. ఒకవైపు లావుగా ఉందని తనను నిర్లక్ష్యానికి గురిచేయసాగాడు. 
 
మరోవైపు, మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో శ్రీలత మనస్తాపానికి గురై, చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనను పోలీసులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు కేసు నమోదు చేసి దర్యాప్తు  చేస్తున్నారని దుండిగల్ సీఐ తెలిపారు.
 
మరోవైపు తమ కూతురును చంపేసి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని శ్రీలత తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఎనిమిదేళ్ల క్రితం​ తమ అమ్మాయి శ్రీలతను కానిస్టేబుల్ శివకుమార్‌తో వివాహం చేశామని తెలిపారు. వివాహం జరిగినప్పటి నుంచి కట్నం కోసం వేధింపులు చేస్తున్నాడని తెలిపారు. 
 
ఇక కానిస్టేబుల్ శివ కుమార్ ఆరేళ్ల కూతురు తన తండ్రి అరాచకంపై కన్నీరు పెట్టుకుంది. అమ్మను ప్రతిరోజు  కొట్టేవాడని, అన్నం పెట్టకుండా వేధించే వాడని చిన్నారి తెలిపింది. బయట నుంచి కోపంతో వచ్చి అమ్మ పైన దాడి చేసేవాడిని తెలిపింది. ఆ కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీచైతన్య కాలేజీ విద్యార్థిని బలవన్మరణం