తెలంగాణ రాష్ట్రంలో ఓ విషాదం చోటుచేసుకుంది. తెల్లవారితే పెళ్లి జరగాల్సిన వరుడు అంతలోనే బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తలకొండపల్లి మండలం మెదక్‌పల్లి గ్రామంలో శ్రీకాంత్ (24) అనే యువకుడు గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఓ వైపు పెళ్లికి కుటుంబీకులు ఏర్పాట్లు చేస్తుండగానే శ్రీకాంత్ బలవన్మరణానికి పాల్పడ్డాడు.
స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. అయితే, ఆత్మహత్యకుగల కారణాలు తెలియరాలేదు. శ్రీకాంత్ ఆత్మహత్యకు పాల్పడటంతో అటు కుటుంబీకులు కన్నీరు మున్నీరవుతుండగా.. పెళ్లి కూతురు ఇంట విషాదం అలుముకుంది.