Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వచ్చే నెలలో తెలంగాణ ఎంసెట్‌ పరీక్ష

Advertiesment
వచ్చే నెలలో తెలంగాణ ఎంసెట్‌ పరీక్ష
, మంగళవారం, 11 ఆగస్టు 2020 (10:02 IST)
తెలంగాణ ఉన్నత విద్యామండలి ఉమ్మడి ప్రవేశ పరీక్ష తేదీలను ఖరారు చేసింది. రాష్ట్రంలో వివిధ వృత్తి, సాంకేతిక విద్యాకోర్సుల్లో ప్రవేశాల కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణకు కరసత్తు పూర్తయింది.

ఈ నెల 31న ఈసెట్‌, సెప్టెంబర్‌ 2న పాలిసెట్‌ నిర్వహించనుంది. అలాగే సెప్టెంబర్‌ 9,10,11,14 తేదీల్లో ఎంసెట్‌ ఇంజనీరింతగ్‌ పరీక్షలను నిర్వహించనుంది. కోర్టు అనుమతితో ఈ తేదీలను ఉన్నత విద్యామండలి అధికారికంగా ప్రకటించనుంది.

రాష్ట్రంలో ప‍్రవేశ పరీక్షలు, ఫైనల్‌ సెమిస్టర్‌ పరీక్షలపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నెలాఖరు లేదా సెప్టెంబర్‌లో పరీక్షల నిర్వహణకు ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోందని ప్రభుత్వం ఈ సందర్భంగా న్యాయస్థానంకు తెలిపింది. ఇక ఫైనల్‌ సెమిస్టర్‌ పరీక్షలపై సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విద్యాభివృద్ధి కృషి చేస్తా: వెట్రిసెల్వి