తెలంగాణలో ఎంసెట్-2022, ఈసెట్-2022 ప్రవేశపరీక్షలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంసెట్ కోసం ఏప్రిల్ 6 నుంచి మే 28 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు.
జూలై 14,15 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్ష.. జూలై 18,19,20 తేదీల్లో ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రకటన చేసింది.
మరోవైపు ఈసెట్ నోటిఫికేషన్ ప్రకారం ఏప్రిల్ 6 నుంచి జూన్ 8 వరకు అధికారులు దరఖాస్తులను స్వీకరించనున్నారు. జూలై 13న ఎంట్రన్స్ పరీక్షను నిర్వహించనున్నారు.
కాగా ఎంసెట్‌ను ఏపీ, తెలంగాణలో 105 కేంద్రాల్లో నిర్వహిస్తామని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య లింబాద్రి వెల్లడించారు.
అయితే ఎంసెట్‌లో వెయిటేజ్, ఇంటర్‌లో మినిమం మార్క్స్, ఎంసెట్ సిలబస్‌పై అధికారికంగా ఇప్పటివరకు ఉత్తర్వులు వెలువడలేదు.