Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణ ఎన్నికలు : జిల్లాల వారీగా పోలింగ్ శాతం

Advertiesment
తెలంగాణ ఎన్నికలు : జిల్లాల వారీగా పోలింగ్ శాతం
, ఆదివారం, 9 డిశెంబరు 2018 (12:27 IST)
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈనెల 7వ తేదీన శుక్రవారం ముగిసింది. ఈ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఓటరన్న పోలింగ్ కేంద్రాలకు క్యూకట్టారు. ఫలితంగా రికార్డు స్థాయిలో 73.2 శాతం మేరకు పోలింగ్ నమోదైంది. ఈ నేపథ్యంలో జిల్లా వారీగా పోలింగ్ శాతాన్ని పరిశీలిస్తే, 
 
ఆసిఫాబాద్-85.97, మంచిర్యాల-78.72, ఆదిలాబాద్-83.37, నిర్మల్-81.22, నిజామాబాద్-76.22, కామారెడ్డి-83.05, జగిత్యాల-77.89, పెద్దపల్లి-80.58, కరీంనగర్-78.20, సిరిసిల్ల-80.49, సంగారెడ్డి-81.94, మెదక్-88.24, సిద్దిపేట-84.26, రంగారెడ్డి-61.29, వికారాబాద్-76.87, మేడ్చల్ మల్కాజ్ గిరి-55.85, హైదరాబాద్-48.89, మహబూబ్ నగర్-79.42, నాగర్ కర్నూల్-82.04, వనపర్తి-81.65, గద్వాల్-82.87, నల్గొండ-86.82, సూర్యపేట-86.63, జనగామ-87.39, భువనగిరి-90.95, మహబూబాబాద్-89.70, వరంగల్ రూరల్-89.68, వరంగల్ అర్బన్-71.18, భూపాలపల్లి-82.31, భద్రాద్రి కొత్తగూడెం-82.46, ఖమ్మం-85.99 చొప్పున నమోదైంది. 
 
అలాగే, అత్యధికంగా పోలింగ్ నమోదైన అసెంబ్లీ నియోజకవర్గాల వివరాలను పరిశీలిస్తే, మధిర-91.65, ఆలేరు-91.33, మునుగోడు-91.07, నర్సాపూర్-90.53, భువనగిరి-90.53, నర్సంపేట-90.06 శాతం చొప్పున పోలింగ్ నమోదైంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మాగుంట కంపెనీల్లో కొనసాగుతున్న ఐటీ సోదాలు