Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రికార్డు స్థాయిలో పోలింగ్ : అభ్యర్థుల గుండెల్లో గుబులు

రికార్డు స్థాయిలో పోలింగ్ : అభ్యర్థుల గుండెల్లో గుబులు
, ఆదివారం, 9 డిశెంబరు 2018 (10:55 IST)
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగింది. దీంతో అభ్యర్తులు ఆందోళన చెందుతున్నారు. పెరిగిన ఓటింగ్ ఎవరికి అనుకూలంగా ఉంటుందోనని అంచనాలు వేస్తున్నారు. అధిరాక తెరాస మాత్రం తమ అమలు చేసిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన ఓటర్లు కారు గుర్తుకు ఓటేశారని అంటున్నారు. కానీ, విపక్ష పార్టీలు మాత్రం ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనమంటూ బల్లగుద్ధి వాదిస్తున్నారు. 
 
మరోవైపు, రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగినట్టు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రజత్ కుమార్ వెల్లడించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, గతంలో ఎన్నడూలేనంతగా తాజా ఎన్నికల్లో రికార్డుస్థాయి పోలింగ్‌ను నమోదైనట్టు చెప్పారు. ఇందులో గ్రామీణ ప్రాంత ఓటర్లు అత్యంత చైతన్యం చూపగా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఓటర్లు మాత్రం నిర్లిప్తంగా ఉండిపోయారని తెలిపారు. 
 
రాష్ట్రంలోని 74 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 70 శాతానికిపైగా పోలింగ్ నమోదుకాగా.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 24 సెగ్మెంట్లలో 50 శాతానికి మించలేదని చెప్పారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో సగటున 73.2 శాతం పోలింగ్ నమోదైందని తెలిపారు. గతంలో ఎన్నడూ ఈస్థాయిలో పోలింగ్ నమోదుకాలేదని పరిశీలకులు స్పష్టంచేస్తున్నారు. 
 
2014 ఎన్నికలతో (69.5శాతం) పోలిస్తే.. ఈసారి సుమారు 3.70 శాతం మేర పోలింగ్ పెరిగిందని రజత్‌కుమార్ తెలిపారు. మునుపెన్నడూ లేనివిధంగా సంక్షేమ పథకాలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలుచేయటం, ప్రజల్లో ఓటుపై పెరిగిన చైతన్యం వారిని పోలింగ్ కేంద్రాలవరకు రప్పించాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాంగ్రెస్ గెలిచాక గడ్డం తీసేస్తా : ఉత్తమ్ కుమార్ రెడ్డి