Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆ కుక్క రోజూ కరుస్తోంది... పోలీసులకు ఫిర్యాదు

Dogs
, సోమవారం, 6 జూన్ 2022 (16:35 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఓ వ్యక్తి పోలీసులకు చేసిన ఫిర్యాదు చూస్తే ప్రతి ఒక్కరూ పడిపడి నవ్వుతారు. మండల కేంద్రాలయం వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద ఉండే ఓ కుక్క రోజూ తన వెంటపుడూత కరుస్తుందని అందులో పేర్కొన్నారు. పైగా, ఆ కుక్క యజమానిపై కేసు పెట్టాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, పాలమూరు జిల్లా గూడూరు మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన ధరావత్ పూల్య నాయక్ అనే వ్యక్తి సోమవారం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఓ ఫిర్యాదు చేశారు. గూడూరు మండల కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయం సమీపంలో ఉన్న ఓ కుక్క ప్రతి రోజూ తన వెంటపడుతూ కరుస్తుందని ఫిర్యాదు చేశాడు. 
 
ఆ కుక్క యజమాన్ని దాన్ని ఇంట్లో కట్టేయకుండా బయటకు వదిలివేయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని తెలిపారు. అందువల్ల యజమానిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును చూసిన పోలీసులకు తొలుత అవాక్కయ్యారు. ఆ తర్వాత తేరుకుని కుక్క యజమానికి పిలిచి మందలించారు. పైగా, కుక్కకరిచిన వ్యక్తికి వైద్యం చేయించాలంటూ ఆదేశించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భర్తను కట్టేసి.. గర్భిణిపై సామూహిక అత్యాచారం