Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రీశైలం ఘాట్‌ రోడ్డు.. బస్సు కిటికీ నుంచి తలను బయటకు పెట్టింది.. అంతే?

శ్రీశైలం ఘాట్‌ రోడ్డు.. బస్సు కిటికీ నుంచి తలను బయటకు పెట్టింది.. అంతే?
, గురువారం, 2 డిశెంబరు 2021 (20:50 IST)
శ్రీశైలం ఘాట్‌ రోడ్డు మలుపులతో కూడి వుంటుంది. శ్రీశైలం కొండపైకి వెళ్లేందుకు మలుపుతో ఉన్న రహదారిలో ప్రయాణం చేయాల్సి వుంటుంది. ఈ ఘాట్ రోడ్డుల్లో ప్రమాదాలు సంభవించకుండా వుండేందుకు అధికారులు రాత్రి నుంచి ఉదయం వరకు రాకపోకలను నిలిపేస్తారు. కానీ శ్రీశైలంలో జరిగిన ఓ ప్రమాదంలో ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. 
 
వివరాల్లోకి వెళితే.. శ్రీశైలంకు వెళుతున్న బస్సులో ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. శ్రీశైలం సమీపంలో నల్లమల ఘాట్‌రోడ్డులో బస్సు కిటికీ నుంచి తలను బయటకు పెట్టింది. దీంతో ఎదురుగా వస్తున్న లారీ ఒక్కసారిగా ఆ యువతి తలకు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ హఠాన్మరణంలో బస్సులోని ప్రయాణీకులు షాకయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒమిక్రాన్ కేసులు.. భారత్‌లో లాక్‌డౌన్ తప్పదా?