Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆ ఆత్మహత్యకు ఆ వ్యవహారమే కారణమట..

మొత్తానికి కుకునూరు పల్లి ఎస్సై ప్రభాకరరెడ్డి ఆత్మహత్యకు పోలీసు అధికారి వేధింపు కారణం కాదు. బ్యూటీషియన్ శిరీష వ్యవహారమే కారణమని పోలీసులు తేల్చివేయబోతున్నారు. సంచలనం సృష్టించిన కుకునూర్‌పల్లి ఎస్సై ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్యకు బ్యూటీషియన్‌ శిరీష వ్యవహార

ఆ ఆత్మహత్యకు ఆ వ్యవహారమే కారణమట..
హైదరాబాద్ , శుక్రవారం, 23 జూన్ 2017 (01:59 IST)
మొత్తానికి కుకునూరు పల్లి ఎస్సై ప్రభాకరరెడ్డి ఆత్మహత్యకు పోలీసు అధికారి వేధింపు కారణం కాదు. బ్యూటీషియన్ శిరీష వ్యవహారమే కారణమని పోలీసులు తేల్చివేయబోతున్నారు. సంచలనం సృష్టించిన కుకునూర్‌పల్లి ఎస్సై ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్యకు బ్యూటీషియన్‌ శిరీష వ్యవహారమే కారణమంటూ ఈ కేసులో విచారణాధికారి నివేదిక సిద్ధం చేసినట్లు తెలిసింది. ప్రభాకర్‌ రెడ్డిని గజ్వేల్‌ ఏసీపీ వేధించినట్లుగా వచ్చిన ఆరోపణలకు ఎక్కడా ఆధారాల్లే వని వెల్లడైనట్లుగా అందులో నిర్ధారించినట్లు సమాచారం. పైగా ఎస్సై ఆత్మహత్యకు పై అధికారుల వేధింపులే కారణమని పోలీసు స్టేషనుపై దాడి చేసి విధ్వంసం సృష్టించిన ప్రభాకరరెడ్డి బంధువులు, తదితరులపై కేసు పెట్టాలని అధికారులు నిర్ణయించడం గమనార్హం.
 
ఈ నెల 14న ఎస్సై ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రభాకర్‌రెడ్డిది హత్య అని కొంద రు, ఉన్నతాధికారుల వేధింపుల తో ఆత్మహత్య చేసుకున్నారని ఆయన కుటుంబీకులు ఆరోపించారు. దీంతో డీజీపీ అనురాగ్‌ శర్మ ఈ ఘటనపై అదనపు డీజీపీ గోపీకృష్ణతో విచారణకు ఆదేశించారు. ఆయనతోపాటు సంగారెడ్డి డీఎస్పీ తిరుపతన్న విచారణ జరిపారు.
 
వారు కుకునూర్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ను, ఎస్సై క్వార్టర్స్‌ను పరిశీలించారు. శిరీష ఆత్మహత్య కేసులో అరెస్టయిన రాజీవ్, శ్రవణ్‌‌లను.. కుకునూర్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ సిబ్బందిని ప్రశ్నించారు. ఉన్నతాధికారుల వేధింపులకు సంబంధించి ఏవైనా ఆధారాలు ఉన్నాయేమో నని ఆరా తీశారు. అయితే గజ్వేల్‌ ఏసీపీ కావాలనే ఎస్సై ప్రభాకర్‌రెడ్డిని వేధించినట్లుగా వచ్చిన ఆరోపణల్లో ఎక్కడా ఆధారాల్లేవని విచారణాధికారులు ధ్రువీకరించుకున్నట్టు తెలుస్తోంది.
 
అయితే మెటర్నిటీ సెలవు విష యంలో, పాత కేసుల క్లోజింగ్‌ విషయంలో  ఏసీపీ వేధించినట్టు ఆధారాలున్నాయని.. చార్జిమెమోల విషయంలో ఆధారాలేమీ లేవని గుర్తించినట్లు సమాచారం. శిరీష వ్యవహారం లో ఆరోపణలు వస్తే సమాజంలో పరువు పోతుందన్న భయం, మానసిక ఒత్తిడి, క్షణికా వేశంలోనే ఎస్సై ఆత్మహత్యకు పాల్పడినట్టు గా నివేదికలో పొందుపరిచినట్టు తెలుస్తోంది.
 
ఎస్సై ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్న రోజు కుకునూర్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ ఎదుట చేసిన ఆందోళన, దాడులను పోలీసు శాఖ తీవ్రంగా పరిగణిస్తోంది. పోలీస్‌శాఖపై ఆరోపణలు చేసిన సిబ్బందితో పాటు మీడియా వాహనాలు, పోలీస్‌ వాహనాల ధ్వంసానికి యత్నించిన ప్రైవేట్‌ వ్యక్తులపై కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ అయినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వేగవంతంగా స్మార్ట్ విలేజ్ పనులు... యనమల రామకృష్ణుడు