Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 8 April 2025
webdunia

ఓ కానిస్టేబుల్ అక్రమ వసూళ్లు... ట్విట్టర్‌ ద్వారా స్పందించిన డీజీపీ

Advertiesment
Police Constable
, శనివారం, 10 ఆగస్టు 2019 (21:29 IST)
కానిస్టేబుల్‌ అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవడంతో తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. వర్ధన్నపేట పోలీసుస్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్‌ డబ్బులు వసూళ్లు చేస్తున్నట్లు ఉన్న వీడియోను షేర్‌ చేస్తూ వరంగల్‌ పోలీసు కమిషనర్‌ డాక్టర్‌ రవీందర్‌ను విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆయన ట్విట్టర్‌ ద్వారా ఆదేశించారు. 
 
ఇటీవల రెండు రోజుల క్రితం వర్ధన్నపేట సీఐ ఇసుక ర్యాంపులు, మద్యం దుకాణాలపై మామూళ్లు వసూలు చేస్తున్నట్లు సీపీ దృష్టికి వెళ్లడంతో అతనికి మెమో జారీ చేసినప్పటికీ, అదే స్టేషన్‌ పరిధిలో ఓ కానిస్టేబుల్‌ అక్రమ వసూళ్ల వీడియో వైరల్‌ కావడం పెద్ద చర్చనీయాంశంగా మారింది.
 
ఆ వీడియోలో ఇసుక ట్రాక్టర్ల యాజమానుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ విషయమై వర్ధన్నపేట ఏసీపీ మధుసూదన్‌ను వివరణ కోరగా ఉన్నతాధికారుల నుంచి విచారణ చేపట్టాలని ఉత్తర్వులు అందినట్లు పేర్కొన్నారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తానని ఆయన పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం సరైనదే' - రాకేష్ సిన్హా