Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేడు తెలంగాణాకు ప్రధాని నరేంద్ర మోడీ - షెడ్యూల్ ఇదే

kcr - modi
, ఆదివారం, 1 అక్టోబరు 2023 (09:59 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం తెలంగాణ రాష్ట్ర పర్యటనకు రానున్నారు. ఇక్కడ నుంచి ఆయన తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఆయన శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. 
 
అయితే, నరేంద్ర మోడీ పర్యటన సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీర్ గైర్హాజరుకానున్నారు. ప్రధాని ఎప్పుడు రాష్ట్రానికి వచ్చినా ఆయనకు స్వాగతం పలకకుండా దూరంగా ఉంటున్న విషయం తెల్సిందే. ఈ దఫా కూడా కేసీఆర్.. ప్రధాని పర్యటనకు దూరంగా ఉండనున్నారు. ఆయనకు బదులుగా మంత్రులు ఎయిర్‌పోర్టుకు వెళ్లి ప్రధానికి స్వాగతం పలుకుతారు. 
 
మధ్యాహ్నం 1.30 గంటలకు మోడీ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. సాధారణంగా సీఎం ఆయనకు స్వాగతం పలకాల్సి ఉండగా.. ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈసారి స్వాగతం పలుకుతారు. కేసీఆర్ వైరల్ ఫీవర్తో బాధపడుతుండడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.
 
నిజానికి మోడీ - కేసీఆర్ మధ్య బంధం ఇటీవలి వరకు బాగానే ఉండేది. అయితే, లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత పేరు తెరపైకి రావడం, ఆమెను అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జరగడంతో కేంద్రంతో కేసీఆర్ సంబంధాలు దెబ్బతిన్నట్టు ప్రచారం జరిగింది. అప్పటి నుంచి వీలు చిక్కినప్పుడల్లా బీఆర్ఎస్ నేతలు నరేంద్ర మోడీపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు.
 
మోడీ పర్యటన ఖరారైన తర్వాత మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు సహా అందరూ ప్రధానిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేటీఆర్ అయితే ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. మోడీ ఓట్ల కోసం బయలుదేరిన మాయగాడని ధ్వజమెత్తారు. తల్లిని చంపి బిడ్డను వేరుచేశారంటూ అప్పట్లో తెలంగాణపై విషం కక్కారని మండిపడ్డారు. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తారా? ప్రజాగ్రహానికి గురవుతారా? అని హెచ్చరించారు.
 
మరోవైపు, మధ్యాహ్నం 1.30 గంటలకు హైదరాబాద్‌కు చేరుకునే ఆయన.. అక్కడ నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో మహబూబ్ నగర్‌కు చేరుకుంటారు. 2.10 గంటలకు పాలమూరు హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. 2.15 నుంచి 2.50 గంటల వరకు వివిద అభివృద్ధి పనులకు ఆయన ప్రారంభోత్సవాలు చేస్తారు. 3 గంటలకు బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకుని 4 గంటలకు వరకు అక్కడే ఉంటారు. 4.10 గంటలకు పాలమూరు హెలిపాడ్ నుంచి హెలికాఫ్టర్‌లో శంషాబాద్‌కు పయనమై 4.45 గంటలకు ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. 4.50 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళుతారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అక్రమ అరెస్టుకు నిరసనగా గాంధీ జయంతి రోజున జైలులో చంద్రబాబు దీక్ష