Publish Date: Fri, 27 Mar 2020 (20:10 IST)
Updated Date: Fri, 27 Mar 2020 (20:12 IST)
కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా చేపట్టిన లాక్‌డౌన్ నూరు శాతం సఫలీకృతం అయ్యేలా.. మొబైల్ రైతు బజార్లను ఏర్పాటు చేస్తున్నట్టు వ్యవసాయశాఖ అడిషనల్ డైరక్టర్ లక్ష్మణుడు తెలిపాడు. రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేసిన రైతు బజార్‌ను ఆయన పరిశీలించారు.
కరోనా వ్యాప్తి నివారణకు రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. వ్యవసాయ మార్కెట్ శాఖ ఆధ్వర్యంలో మొబైల్ రైతు బజార్లను ఏర్పాటు చేస్తోంది. రంగారెడ్డి జిల్లా వనస్థలిపురంలోని రైతు బజార్‌ను వ్యవసాయ శాఖ అడిషనల్ డైరెక్టర్ లక్ష్మణుడు పరిశీలించారు. కూరగాయాలు విక్రయించే వారు తీసుకోవలసిన జాగ్రత్తలను సూచించారు.
మాస్క్‌లను ధరించాలని, క్యూ పద్ధతి, సామాజికి దూరం పాటించాలని విక్రయదారులను, కొనుగోలు దారులను కోరారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ మొబైల్ రైతు బజార్ సౌకర్యాలను ప్రజలు వినియోగించుకుని లాక్‌డౌన్‌కు సహకరించాలని కోరారు. త్వరలోనే మొబైల్ రైతు బజార్లలో పండ్లునూ పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు.