Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 14 April 2025
webdunia

పెళ్ళయి నెలరోజులే, కిలో బంగారం 25 లక్షలతో ప్రియుడితో వివాహిత జంప్

Advertiesment
Married
, బుధవారం, 5 మే 2021 (18:02 IST)
తన భార్య అంటే ఆ భర్తకు ఎంతో ఇష్టం. ఆమె అడిగినదంతా కొనిచ్చేవాడు. కొత్తగా పెళ్ళయ్యింది. ఆమే సర్వస్వమనుకున్నాడు. అయితే భార్య మాత్రం భర్తను నిట్టనిలువునా ముంచింది. పెళ్ళయిన నెలకే ప్రియుడితో జంప్ అయ్యింది. భర్త దాచుకున్న నగదు, నగలను కూడా ఎత్తుకెళ్ళిపోయింది.
 
జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ ప్రాంతానికి చెందిన 26 యేళ్ళ యువతికి నెల క్రితమే ఘన్‌పూర్ ప్రాంతానికి చెందిన వ్యక్తితో వివాహమైంది. పెళ్ళి కొడుకు బంగారు వ్యాపారి. స్వయంగా పాన్ బ్రోకర్ షాపును నడుపుతున్నాడు. బాగా ఆస్తిపరుడు. ఏమాత్రం కట్నం తీసుకోకుండా పెళ్ళి చేసుకున్నాడు.
 
భార్య వచ్చిందన్న ఎన్నో ఆశలు అతనిలో ఉన్నాయి. కొత్తగా పెళ్ళయింది. భార్యను బయటకు తీసుకెళుతూ అడిగివన్నీ కొనిచ్చేవాడు. ఆమే తన సర్వస్వం అనుకున్నాడు. పెళ్ళయిన పదిరోజులకే తల్లిదండ్రుల కోసం వేరే ఇంటికి పంపించాడు. అంతలా భార్యను నమ్మాడు.
 
అయితే ఫేస్ బుక్ అతని జీవితాన్ని నాశనం చేస్తుందనుకోలేదు అతను. తన భార్య ఫేస్ బుక్ చూస్తూ హైదరాబాద్‌కు చెందిన ఒక యువకుడితో తరచూ ఛాటింగ్ చేస్తూ ఉండేది. వ్యాపారంలో ఉండే అతను భార్య గురించి పట్టించుకోలేదు. అయితే తన విషయాలను మొత్తాన్ని యువకుడికి చెప్పింది యువతి.
 
ఆమెకు చాటింగ్ లోనే మాయమాటలు చెప్పాడు యువకుడు. హైదరాబాద్‌కు వచ్చేస్తే నిన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటానన్నాడు. అంతే.. అతని మాటలు నమ్మిన వివాహిత ఇంటిలో భర్త ఉంచిన కిలో బంగారంతో పాటు 25 లక్షల నగదును తీసుకుని వెళ్ళిపోయింది. భర్త ఫిర్యాదుతో యువకుడితో పాటు వివాహిత కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భయపెడుతున్న కరోనా.. హిమాచల్ ప్రదేశ్‌లో లాక్డౌన్