Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆస్ట్రేలియాలో తెలుగు టెక్కీ అనుమానాస్పద మృతి

ఆస్ట్రేలియాలో మరో తెలుగు సాఫ్ట్‌వేర్ అనుమానాస్పదంగా మరణించారు. ఆయన పేరు ఆదినారాయణ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా నేరేడు చర్ల మండలం ఇంజంగారి గూడెంవాసి. ఉద్యోగం కోసం ఆర్నెళ్ల క్రితం ఆస్ట్

Advertiesment
Infosys techie
, మంగళవారం, 26 డిశెంబరు 2017 (08:57 IST)
ఆస్ట్రేలియాలో మరో తెలుగు సాఫ్ట్‌వేర్ అనుమానాస్పదంగా మరణించారు. ఆయన పేరు ఆదినారాయణ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా నేరేడు చర్ల మండలం ఇంజంగారి గూడెంవాసి. ఉద్యోగం కోసం ఆర్నెళ్ల క్రితం ఆస్ట్రేలియాకు వెళ్లిన ఆదినారాయణ రెడ్డి.. సిడ్నీలోని ఇన్ఫోసిస్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా పని చేస్తున్నారు. ఈయన ఆదివారం రాత్రి అనుమానాస్పదంగా మరణించారు. 
 
ఆదివారం సాయంత్రం తన భార్య శిరీష‌తో మాట్లాడారు. మరుసటిరోజు భార్య ఫోన్ చేయగా, ఆదినారాయణ రెడ్డి లిఫ్ట్ చేయలేదు. దీంతో ఆస్ట్రేలియాలోని ఆయన స్నేహితులకు ఫోన్ చేసి విషయం చెప్పి, రూంకు వెళ్లి చూడాలని కోరారు. దీంతో ఆదినారాయణ రూంకు వెళ్లి చూడగా, ఆయన విగతజీవిగా పడివున్నారు. ఈ విషయాన్ని అతని స్నేహితులు కుటుంబ సభ్యులకు చేరవేశారు. 
 
భర్త మరణవార్త వినగానే శిరీష కుప్పకూలిపోయింది. శిరీష - ఆదినారాయణకు మూడేళ్ల కవల పిల్లలున్నారు. ఆదినారాయణ రెడ్డి‌ మృతిపై ఆసీస్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. తన భర్త మృతి కేసులో అనుమానం ఉందనీ, దీనిపై లోతుగా దర్యాప్తు జరిపించాలని భార్య శిరీష కోరుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వింత పిల్లలకు జన్మనిచ్చిన మేక