Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కుటుంబ కలహాలతో విసుగు.. భర్తను ఇంట్లో పెట్టి తాళం వేసి.. బిడ్డతో పాటు..?

కుటుంబ కలహాలతో విసుగు.. భర్తను ఇంట్లో పెట్టి తాళం వేసి.. బిడ్డతో పాటు..?
, బుధవారం, 3 ఫిబ్రవరి 2021 (20:46 IST)
క్షణికావేశాలు నేరాలకు ఘోరాలకు దారితీస్తున్నాయి. మహిళలపై ఓవైపు అకృత్యాలు పెచ్చరిల్లిపోతుంటే.. మరోవైపు గృహ హింస కూడా మానసిక ఆవేదనకు కారణమవుతున్నాయి. తాజాగా కుటుంబ సమస్యలతో విసిగివేసారిన ఓ మహిళ భర్తను ఇంట్లో తాళం వేసి తన 8 నెలల కూతురుతో సహా భవనం పైనుంచి దూకింది. 
 
హైదరాబాదు నగరంలోని బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 12లో సోమవారం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషాదంలో మహిళ చనిపోగా శిశువు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంది. వివరాల్లోకి వెళితే.. బీహార్‌కు చెందిన బిస్మల్‌ సింగ్‌, అనిత(24) ఇరువురు దంపతులు. గడిచిన మూడు నెలలుగా బంజారాహిల్స్‌ పరిధి శ్రీనగర్‌ కాలనీలో నివాసముంటున్నారు. కాగా దంపతులిద్దరూ తరచుగా గొడవపడుతుండేవారు. బంధువులు వచ్చి సయోధ్య కుదిర్చి వెళ్తుండేవారు.
 
సోమవారం కూడా ఇలాగే ఇరువురి మధ్య వివాదం తలెత్తింది. దీంతో భర్తను అనిత ఇంట్లో తాళం వేసి భవనం రెండో అంతస్థు బాల్కనీ నుండి తన చంటి బిడ్డతో సహా దూకింది. చుట్టుప్రక్కలవారు, స్థానికులు వెంటనే ఇరువురిని స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అనిత చనిపోయినట్లుగా వైద్యులు ప్రకటించారు. చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు బంజారాహిల్స్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్‌ కె. ఉదయ్‌ తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలుగు రాష్ట్రాల్లో పదవ తరగతి పరీక్షలు... షెడ్యూల్ వివరాలు