హైదరాబాద్ నగరంలో మరో దారుణం జరిగింది. రాజేంద్ర నగర్ ఏరియాలో కన్న కుమార్తెపై కన్నతండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణం గత 15 రోజులుగా కొనసాగుతూ వచ్చింది. భార్య మృతి చెందడంతో కన్నతండ్రే కన్నకుమార్తెపై లైంగికదాడికి పాల్పడసాగాడు.
ఈ విషయం తెలుసుకున్న స్థానికులు నిందితుడుని పట్టుకుని చితకబాదారు. ఆ తర్వాత స్థానికులు 100కు సమాచారం ఇవ్వడంతో పోలీసులు రంగప్రవేశం చేసి నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడుపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అదేసమయంలో నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కేసు విచారణ జరుపుతున్నారు.