Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టి.తెదేపాను ఎలా విలీనం చేసుకుంటారు...? కేసీఆర్ సర్కారుపై హైకోర్టు సీరియస్... 3 నెలల్లో తేల్చండి...

ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు తెలంగాణ సర్కారుకు మొట్టికాయ వేసింది. సైకిల్ పార్టీ కింద గెలిచి ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు కారు ఎక్కేసిన తెలంగాణ తెలుగుదేశం ఎమ్మెల్యేలు తాము నేతృత్వం వహిస్తున్న టి.తెదేపాను తెలంగాణ అధికార పార్టీలో విలీనం చేస్తున్నట్లుగా పేర్కొన్

Advertiesment
Highcourt angry on Telangna Govt Decission
, గురువారం, 22 సెప్టెంబరు 2016 (10:05 IST)
ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు తెలంగాణ సర్కారుకు మొట్టికాయ వేసింది. సైకిల్ పార్టీ కింద గెలిచి ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు కారు ఎక్కేసిన తెలంగాణ తెలుగుదేశం ఎమ్మెల్యేలు తాము నేతృత్వం వహిస్తున్న టి.తెదేపాను తెలంగాణ అధికార పార్టీలో విలీనం చేస్తున్నట్లుగా పేర్కొన్న అంశం సరికాదని తేల్చింది. 
 
ఎమ్మెల్యేల ఫిరాయింపుల పైన అసెంబ్లీ స్పీకర్ వద్దకు వచ్చిన ఫిర్యాదులను పట్టించుకోకుండా విలీనం ఎలా చేస్తారంటూ ప్రశ్నించింది. ముందుగా ఫిరాయింపులకు పాల్పడ్డ ఎమ్మెల్యేలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో మరో 3 నెలలు లోపుగా తేల్చేయాలంటూ తెలంగాణ స్పీకర్‌ను ఆదేశించింది. ఒకపక్క పార్టీ ఫిరాయించిన తమ పార్టీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తే దాన్ని పట్టించుకోకుండా విలీనం ఎలా చేస్తారంటూ ప్రశ్నించింది. కాబట్టి ఈ అంశంపై 3 నెలల లోపు నిర్ణయం వెలువరించాలని తెలిపింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కన్నకుమార్తెపై మూడేళ్ళగా అత్యాచారం చేస్తున్న తండ్రి...