Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కన్నకుమార్తెపై మూడేళ్ళగా అత్యాచారం చేస్తున్న తండ్రి...

కామంతో కళ్ళు మూసుకుపోయిన ఓ కామాంధుడు తండ్రి అన్న పదానికే మచ్చతెచ్చాడు. కన్నకూతురిపైనే మూడేళ్లుగా అత్యాచారం చేస్తూ.. గర్భవతిని చేసి.. ఆమెకు నరకయాతన చూపించాడు. ఇలాంటి పాడుపని చేయొద్దని 16 ఏళ్ల ఆ బాలిక

Advertiesment
Madras HC
, గురువారం, 22 సెప్టెంబరు 2016 (09:54 IST)
కామంతో కళ్ళు మూసుకుపోయిన ఓ కామాంధుడు తండ్రి అన్న పదానికే మచ్చతెచ్చాడు. కన్నకూతురిపైనే మూడేళ్లుగా అత్యాచారం చేస్తూ..  గర్భవతిని చేసి.. ఆమెకు నరకయాతన చూపించాడు. ఇలాంటి పాడుపని చేయొద్దని 16 ఏళ్ల ఆ బాలిక ఎంతగా ప్రాధేయపడ్డా కూడా.. ఆ మానవమృగం ఏమాత్రం కనికరించకుండా మరింత హింసించాడు. ఈ అవమానీయ ఘటన కేరళ రాష్ట్రంలోని వైతిరి పట్టణంలో చోటుచేసుకుంది. 
 
ఆ వివరాలను పరిశీలిస్తే... వైతిరి పట్టణానికి చెందిన 48 ఏళ్ల ఓ వ్యక్తి కామంతో కళ్లు మూసుకుపోయి తన 16 ఏళ్ల కూతురిపైనే అత్యాచారం జరిపాడు. దీంతో ఆ బాలిక గర్భందాల్చింది. తన కూతురు ప్రవర్తనలో మార్పు కనిపించడంతో.. తల్లి కూతురిని వైద్య పరీక్ష కోసం ఆసుపత్రికి తీసుకువెళ్లింది. దీంతో వైద్యులు బాలికను పరీక్షించి ఐదు నెలల గర్భవతి అని తేల్చారు. 
 
అంతే... తల్లి, కూతుళ్లు పోలీసులను ఆశ్రయించి తండ్రి చేసిన అఘాయిత్యం గురించి ఫిర్యాదు చేశారు. దీంతో తాము నిందితుడైన కామ రాక్షసుడిని అరెస్టు చేసి, ఆయనపై ఐపీసీ సెక్షన్ 376, బాలలపై లైంగిక నివారణ చట్టం సెక్షన్ 6ల కింద కేసు నమోదు చేశామని వైతిరి పోలీసు సర్కిల్ ఇన్ స్పెక్టరు అబ్దుల్ షరీఫ్ చెప్పారు. కోర్టు ఆ కామాంధుడికి 14 రోజుల పాటు జుడిషీయల్ రిమాండుకు పంపిస్తూ మేజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనపై మహిళా సంఘాలు తీవ్ర ఆందోళన చేస్తున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భర్తతో కాపురం చేయలేక.. ప్రియుడి ప్రేమను మరిచిపోలేక పురుగుల మందు తాగిన వివాహిత