Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భర్తతో కాపురం చేయలేక.. ప్రియుడి ప్రేమను మరిచిపోలేక పురుగుల మందు తాగిన వివాహిత

పెళ్ళికి ముందు ఉన్న ప్రేమను మర్చిపోలేక పోయారు. వారిద్దరూ రహస్యంగా తమ సంబంధాన్ని కొనసాగిస్తూ వచ్చారు. ఇరువురి కాపురాల్లోనూ ఇదే విషయంపై ఇటీవల గొడవపడ్డారు. ఇక బతకడంకన్నా చావడం మేలనుకుని ఇద్దరూ కలసి పురుగ

Advertiesment
Woman Dies
, గురువారం, 22 సెప్టెంబరు 2016 (09:50 IST)
పెళ్ళికి ముందు ఉన్న ప్రేమను మర్చిపోలేక పోయారు. వారిద్దరూ రహస్యంగా తమ సంబంధాన్ని కొనసాగిస్తూ వచ్చారు. ఇరువురి కాపురాల్లోనూ ఇదే విషయంపై ఇటీవల గొడవపడ్డారు. ఇక బతకడంకన్నా చావడం మేలనుకుని ఇద్దరూ కలసి పురుగు మందు తాగారు. ప్రియురాలు చనిపోగా ప్రియుడు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. 
 
మేడికొండూరుకు చెందిన మహిళ (35) పెళ్ళికి ముందే పేరేచర్లకు చెందిన బాబావలిని ప్రేమించింది. ఆమె తల్లిదండ్రులు ఈ విషయాన్ని దాచి గుంటూరుకు చెందిన బేకరీ నిర్వాహకుడు వినయ్‌కుమార్‌తో వివాహం చేశారు. వారికి ఇద్దరు పిల్లలు పుట్టారు. ఆటో తోలుకుంటూ జీవించే బాబావలికి కూడా ఇద్దరు పిల్లలు. పెళ్లి తర్వాత కూడా బాబావలి, ఆ మహిళ రహస్యంగా కలుసుకుంటూ వచ్చారు. 
 
ఇందుకుగాను పేరేచర్లలో ఒక గదిని అద్దెకు తీసుకున్నారు. ఈ విషయం ఆమె భర్తకు తెలిసి ఇటీవల గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో ఆమె వారం క్రితం పేరేచర్లకు వెళ్ళి ప్రియుడితో ఉంటోంది. విషయం వెలుగులోకి వచ్చి అందరికీ తెలియడంతో ఈనెల 17వ తేదీ రాత్రి ఇద్దరూ కలసి చనిపోదామని పురుగు మందు తాగారు. ఆమె ఎక్కువగా తీసుకోవడంతో స్పృహ కోల్పోయింది. స్పృహలో ఉన్న బాబావలికి బతుకు మీద ఆశ కలిగి ప్రియురాలిని కూడా బతికించుకుందామన్న ఆశతో ఆమెను భుజానపైన వేసుకుని పేరేచర్ల మెయిన్‌ రోడ్డుపైకి వచ్చాడు. అటు వెళ్తున్న వ్యాన్‌ను ఆపి జీజీహెచ్‌కు తీసుకొచ్చాడు. 
 
ఆసుపత్రిలో చేర్చి ఆమె బంధువులకు సమాచారం ఇచ్చి ఏమి తెలియని వాడిలా తను కూడా ఆసుపత్రిలో చేరాడు. ఆ మహిళ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో కుటుంబంలో మనస్పర్ధల కారణంగా పురుగుమందు తాగినట్లు తెలిపింది. బాబావలి కూడా జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ అదే కారణం చెప్పాడు. బుధవారం ఉదయం ఆ మహిళ మృతిచెందింది. విషయం తెలుసుకున్న బాబావలి ఆమె మృతదేహం వద్దకు వచ్చి బోరున విలపించడంతో అసలు విషయం బయట పడింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాకిస్థాన్ ముమ్మాటికీ ఉగ్రవాద దేశమే.. అమెరికా చట్టసభలో బిల్లు