Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాకిస్థాన్ ముమ్మాటికీ ఉగ్రవాద దేశమే.. అమెరికా చట్టసభలో బిల్లు

పాకిస్థాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అదీ కూడా అగ్రదేశం అమెరికా చేతిలోనే. జమ్మూకాశ్మీర్‌లోని యురిలో భారత ఆర్మీ క్యాంపుపై దాడి చేసినందుకు అమెరికాతో పాటు పలు ప్రపంచ దేశాలు గుర్రుగా ఉన్న విషయంతెల్సింద

Advertiesment
us senator
, గురువారం, 22 సెప్టెంబరు 2016 (08:57 IST)
పాకిస్థాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అదీ కూడా అగ్రదేశం అమెరికా చేతిలోనే. జమ్మూకాశ్మీర్‌లోని యురిలో భారత ఆర్మీ క్యాంపుపై దాడి చేసినందుకు అమెరికాతో పాటు పలు ప్రపంచ దేశాలు గుర్రుగా ఉన్న విషయంతెల్సిందే. 
 
ఈ నేపథ్యంలో పాక్‌ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని, సాయం నిలిపివేయాలని కోరుతూ అమెరికా ప్రతినిధుల సభలో బిల్లును ప్రవేశపెట్టారు. సభ్యులు టెడ్‌ పోయ్‌(రిపబ్లికన్‌), డానా రోహ్రాబచర్‌(డెమోక్రటిక్‌) ఈ బిల్లును సభ ముందుంచారు. 
 
అదేసమయంలో జమ్మూకాశ్మీరులో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిపోతోందన్న పాకిస్థాన్ ప్రధానమంత్రి షరీఫ్‌ ప్రచారానికి స్పందన కరువైంది. పలు దేశాధినేతలతో సహా ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ బాన్‌ కీ మూన్‌ను షరీఫ్‌ కలిశారు. అయితే ఆయన మాటలను వారెవరూ వినిపించుకోలేదు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శారీరక సంబంధం పెట్టుకోమని మరదలిని ఒత్తిడి చేసిన ఆప్ ఎమ్మెల్యే.. అరెస్టు