Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణాలో దారుణం, రెండేళ్లుగా యువతిపై తాత, మేనమామల అత్యాచారం

Advertiesment
తెలంగాణాలో దారుణం, రెండేళ్లుగా యువతిపై తాత, మేనమామల అత్యాచారం
, బుధవారం, 12 ఫిబ్రవరి 2020 (19:37 IST)
తెలంగాణలో సభ్య సమాజం తలదించుకునే మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. లాలనగా చూడాల్సి మనవారిలిపై ఓ తాత తన పైశాచికత్వం చూపించాడు. అంతేకాదు బాధ్యతగా మేనకోడలిని రక్షించాల్సిన మేనమామ సైతం ఆమెపై తన క్రూరత్వం ప్రదర్శించాడు. ఫలితంగా తాను ఉంటున్న ఇంట్లోనే.. నా అనుకున్నవారి చేతిలోనే... ఆ యువతికి తీరని అన్యాయం జరిగింది. 
 
తాత, మేనమామ కలిసి ఆమెపై గత రెండేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతుండటంతో.. భరించలేని ఆ అభాగ్యురాలు చివరికి జరిగిన దారుణాన్ని తన తల్లికి తెలిపింది. దీంతో బాధితురాలి తల్లి పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
 
బండ్లగూడ మహ్మద్‌ నగర్‌కు చెందిన షేక్‌ అఫ్సర్‌‌కు 70 ఏళ్లు. ఆయన మనవరాలికి 19 ఏళ్లు. చిన్నతనం నుంచే తాత ఇంట్లోనే పెరిగింది. బాలికపై కన్నేసిన తాతయ్య షేక్‌ అఫ్సర్‌ రెండేళ్ల క్రితం ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అతని కుమారుడు షేక్‌ సిద్దిఖ్‌ సైతం ఆరు నెలల క్రితం ఆమెపై అత్యాచారానికి పాల్పడటమే కాకుండా ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని బెదిరించారు. బాధితురాలు ఈ విషయాన్ని తన తల్లికి చెప్పడంతో ఆమె చాంద్రాయణగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తండ్రి, కొడుకులపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హెల్మెట్‌లో విషనాగు.. 11 కిలోమీటర్లు ప్రయాణం... స్పృహతప్పి..?