Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రతి పేజీలో మంచి పనులు నమోదు కావాలి: తమిళిసై

ప్రతి పేజీలో మంచి పనులు నమోదు కావాలి: తమిళిసై
, బుధవారం, 1 జనవరి 2020 (16:50 IST)
డైరీలోని ప్రతి పేజీలో సమాజ శ్రేయస్సు కోసం మంచి పనులు, విజయాలు నమోదయ్యేలా కృషి చేయాలని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర్ రాజన్ సూచించారు.

తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయుడబ్ల్యుజె) రూపొందించిన మీడియా డైరీ-2020 ని బుధవారం నాడు రాజ్ భవన్ లో తన భర్త డాక్టర్ సౌందర్ రాజన్ తో కలిసి ఆవిష్కరించారు. టీయుడబ్ల్యుజె డైరీలో నమోదైన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రభుత్వ సమాచారాన్ని ఆమె పరిశీలించి అభినందించారు.

ఈ కార్యక్రమంలో ఐజేయు అధ్యక్షులు కె.శ్రీనివాస్ రెడ్డి, మాజీ అధ్యక్షులు, ఎపి ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్, టీయుడబ్ల్యుజె అధ్యక, ప్రధాన కార్యదర్శులు నగునూరి శేఖర్, కె.విరాహత్ అలీ, పిసిఐ సభ్యులు ఎం.ఏ.మాజీద్, ఐజేయు కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, పిసిఐ మాజీ సభ్యులు కె.అమర్ నాథ్, జాతీయ కార్యవర్గ సభ్యులు కల్లూరి సత్యనారాయణ, టీయుడబ్ల్యుజె ఉప ప్రధాన కార్యదర్శి విష్ణుదాస్ శ్రీకాంత్,

ఉపాధ్యక్షులు దొంతు రమేష్, కోశాధికారి కె.మహిపాల్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎ.రాజేష్, యాదగిరి, అయిలు రమేష్, హెచ్.యు.జె. అధ్యక్ష, కార్యదర్శులు రియాజ్ అహ్మద్, శిగ శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. పుష్పగుఛ్చాలకు బదులు తనకు పుస్తకాలు బహుకరించాలని గవర్నర్ తమిళిసై ఇచ్చిన పిలుపుపై స్పందించిన టీయుడబ్ల్యుజె, డైరీ ఆవిష్కరణ సందర్భంలో ఆమెకు పుస్తకాలను బహుకరించింది.
 
గవర్నర్‌ను కలిసిన నూతన సీఎస్‌ సోమేశ్‌కుమార్‌
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన సోమేశ్‌కుమార్‌ గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌ను రాజ్‌భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశాకు. ఈసందర్భంగా ఆమెకు నూతన సంవత్సర శుభాకాంక్షలుతెలిపారు.

సీఎస్‌గా పనిచేసన ఎస్‌కే జోషి నీటిపారుదల సలహాదారుగా నియమితులయ్యారు.ఆయన స్థానంలో సోమేశ్‌కుమార్‌ను నియమిస్తూ ఉత్తర్వులపై ముఖ్యమంత్రి కేసీఆర్‌సంతకం చేశారు. సోమేశ్‌కుమార్‌ 2023 వరకూ సీఎస్‌గా కొనసాగుతారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నమ్మకద్రోహం చేసేవారు బాగుపడరు: ఈటల రాజేందర్