విశ్వక్ సేన్-యాంకర్ దేవి నాగవల్లి వివాదంపై మాజీ మంత్రి దానం నాగేందర్ స్పందించారు. 'అస్సలు విశ్వక్ సేన్‌ని మేము ఓ హీరో అని అనుకోవడం లేదన్నారు. ఏ హీరో కూడా అలాంటి అసభ్యకరమైన మాటలు మాట్లాడరు. అది కూడా లైవ్‌లో ఓ అమ్మాయిపై అంత నీచమైన మాట మాట్లాడటం కరెక్ట్ కాదు. ఈ విషయంలో విశ్వక్ సేన్ ది పెద్ద తప్పు.. అంటూ మండిపడ్డారు.
దేవిగారు మంచి యాంకర్. ఓ హీరో మీడియా ముందుకువెళ్లినప్పుడు నోరు జాగ్రత్తగా పెట్టుకోవాలి. సినిమా ప్రమోషన్స్ కోసం ఆయన చేసిన రచ్చ దారుణం. రోడ్లపై అరాచకం చేశాడు విశ్వక్ సేన్.
అసలు నాగవళ్లి గారు ఆయన ఆ బూతు పదం మాట్లాడినప్పుడే స్పాట్‌లో చెప్పుతో కొట్టి ఉండాల్సింది. అప్పుడైన బుద్ధి వచ్చేది. నిన్న టీవీలో విశ్వక్ సేన్ మాట్లాడిన దానిపై పోలీసులు సుమోటా కేసును నమోదు చేయాలి. లేకపోతే మహిళా సంఘాలు కూడా ఆయనకు బుద్ధి వచ్చేలా చేస్తారు.'అంటూ విశ్వక్ సేన్‌పై ఫైర్ అయ్యారు.