Publish Date: Thu, 10 Feb 2022 (11:19 IST)
Updated Date: Thu, 10 Feb 2022 (11:20 IST)
తెలంగాణా రాష్ట్రంలో కరీంనగర్ జిల్లా హుజురాబాద్ అసెంబ్లీ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను ఆ రాష్ట్ర పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఆయన ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలను ఖండిస్తూ బుధవారం తెరాస చేపట్టిన నిరసనల్లో పలుప్రాంతాల్లో గొడవలు జరిగాయి.
మోడీకి వ్యతిరేకంగా తెరాస, తెరాసకు వ్యతిరేకంగా బీజేపీ శ్రేణులు పోటాపోటీ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం బీజేపీ మౌనదీక్షలకు పిలుపునిచ్చింది. అలాగే, తెరాస శ్రేణులు చేసిన దాడుల్లో బీజేపీ కార్యకర్తలు గాయపడ్డారు. వీరిని పరామర్శించేందుకు ఈటల రాజేందర్ జనగామ బయలుదేరేందుకు సిద్ధమయ్యారు.
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. ఈటల రాజేందర్‌ను గృహనిర్భంధంలో ఉంచారు. దీంతో పోలీసులపై ఈటల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య దేశంలో అందరికీ సమాన హక్కులు ఉంటాయని గుర్తుచేశారు. నిరసనలు, బంద్‌లకు ఒక్క తెరాస పార్టీకే మాత్రమే అనుమతిస్తారా అని ప్రశ్నించారు.
ఠాగూర్
Publish Date: Thu, 10 Feb 2022 (11:19 IST)
Updated Date: Thu, 10 Feb 2022 (11:20 IST)