Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణాలో 26 నుంచి పాఠశాలలకు దసరా సెలవులు

schools closed
, మంగళవారం, 13 సెప్టెంబరు 2022 (12:30 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 26వ తేదీ నుంచి దసరా సెలవులను ప్రకటించింది. ఈ నెల 26వ తేదీ నుంచి అక్టోబరు 8వ తేదీ వరకు ఈ సెలవులు ఇస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు సర్క్యులర్‌ను జారీచేసింది. 
 
అక్టోబరు 5వ తేదీన దసరా పండుగను దేశ వ్యాప్తంగా జరుపుకోనున్న విషయం తెల్సిందే. అందుకు పది రోజులు ముందుగానే స్కూల్స్‌కు దసరా హాలిడేస్‌ ప్రారంభంకానున్నాయి. 
 
అయితే, ఈ నెల 25వ తేదీన, అక్టోబరు 9వ తేదీన ఆదివారాలు కావడంతో మొత్తం 15 రోజుల పాటు సెలవులు కొనసాగనున్నాయి. ఈ సెలవుల తర్వాత అక్టోబరు 10వ తేదీన స్కూల్స్ తిరిగి పునఃప్రారంభంకానున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణ నిరుద్యోగులకు మరో శుభవార్త.. ఏంటది?