Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నీ ఫోన్‌లో ఆ నెంబర్లెవరివి? వారితో నీకు లింకేంటి? భర్త వేధింపులు, భార్య సుసైడ్

Advertiesment
నీ ఫోన్‌లో ఆ నెంబర్లెవరివి? వారితో నీకు లింకేంటి? భర్త వేధింపులు, భార్య సుసైడ్
, బుధవారం, 15 మే 2019 (21:55 IST)
భర్త, అత్త సూటిపోటి మాటలు భరించలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన బాచుపల్లి పియస్ పరిధిలోని నిజాంపేట్‌లో జరిగింది. వికారాబాద్ జిల్లా, తాండూర్ ప్రాంతానికి చెందిన రాజశేఖర్, పుష్పలత(24) లకు నాలుగు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. బ్రతుకుదెరువు కోసం గత మూడు నెలల క్రితం నిజాంపేటకు వలస వచ్చి కుకట్ పల్లి హౌసింగ్ బోర్డ్ మంజీరా షాపింగ్ మాల్‌లో రాజశేఖర్ సెక్యురిటీగా, అదే మాల్‌లో పుష్పలత హౌస్ కీపింగ్‌లో పని చేస్తున్నారు.
 
భార్యాభర్తలు తరుచూ గొడవ పడేవారు. భర్త ఎప్పుడూ తన భార్య ఫోన్లో ఫోన్ నెంబర్‌లు చెక్ చేస్తూ తరచూ అనుమానంగా సూటిపోటి మాటలతో భార్యను వారితో వీరితో ఎందుకు మాట్లాడావని వేధించేవాడు. భర్త వేదింపులకు తోడు అత్త వేధింపులు కూడా తోడవడంతో భార్య పుష్పలత తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడింది. 
 
భర్త, అత్త కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్టు సూసైడ్ నోట్ రాసి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇంటి పైకప్పుకున్న రాడ్‌కి చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇంటి తలుపులు ఎంతకూ తెరవకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చి కిటికీలోంచి చూడగా పుష్పలత ఉరి వేసుకున్నట్లు కనపడటంతో బాచుపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైఎస్ వివేకా హత్య కేసు విచారణ సాగుతోంది...