హైదరాబాదులో మొసలి కలకలం రేపింది. సరూర్‌నగర్ చెరువు మినీ ట్యాంక్‌బండ్‌లో మొసలి ప్రతక్ష్యమైంది. గ్రీన్‌పార్క్ కాలనీ సమీపంలో అటుగా వెళ్తున్న స్థానికులు మొసలి కనిపించడంతో తమ కెమెరాలో బంధించారు.
మొసలి చెరువులోకి ఎలా వచ్చింది? ఒకటే ఉందా లేకా ఇంకా ఉన్నాయా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. చెరువుకు ఆనుకొని పుర్తిగా ఇళ్లు ఉండటంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. అధికారులు స్పందించి చెరువులోని మొసలిని పట్టుకెళ్లాలని కోరుతున్నారు.