Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హుజూర్ నగర్ లో టిఆర్ ఎస్ కు సిపిఐ షాక్

హుజూర్ నగర్ లో టిఆర్ ఎస్ కు సిపిఐ షాక్
, మంగళవారం, 15 అక్టోబరు 2019 (07:36 IST)
హుజూర్ నగర్ ఉప ఎన్నికలలో టి ఆర్ ఎస్ పార్టీకి గతంలో ఇచ్చిన మద్దతును సిపిఐ ఉపసంహరించుకుంది. ఈ మేరకు ఆ పార్టీ కార్యదర్శి చాడా వెంకటరెడ్డి ప్రకటించారు..

మగ్ఢూం భవన్ జరిగిన ఆ పార్టీ కారవర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.. ఉప ఎన్నికలు ప్రకటించిన అనంతరం టి ఆర్ ఎస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు సిపిఐ అధికారికంగా ప్రకటించింది.. అయితే ఆ తర్వాత ఆర్టీసి కార్మికులు సమ్మెకు దిగడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి.. 

కార్మికులపై ఉక్కుపాదం మోపుతున్న టి ఆర్ ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వడంపై కార్మిక పార్టీగా ఉన్న సిపిఐ లోనే అంతర్గత మధనం ప్రారంభమైంది.. ఇప్పటికే ఆర్టీసీ కార్మికుల మద్దతు గా సిపిఐ రంగంలోకి దిగింది.. సమ్మెలో ఆ పార్టీ అనుబంద ఆర్టీసీ కార్మిక యూనియన్ సమ్మెలో పాల్గొంటున్నది..

10 రోజులైన కనీసం కార్మికులతో ప్రభుత్వ చర్చలు జరపకపోవడం పట్ల ఆ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది… ఇప్పటికే సమ్మెపై ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలతో ఇద్దరు ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు.. మరో ఇద్దరు కార్మికులు అత్మహత్యాయత్నం చేశారు.. దీంతో కార్మికుల పక్షానే ఉండాలనే సిపిఐ నిర్ణయించింది.. టి ఆర్ ఎస్ పార్టీకి మద్దతును ఉపసంహరించింది..
 
కేసీఆర్‌ నియంత..
ఆర్టీసీ సమ్మె ఉదృతంగా మారేందుకు కె సి ఆర్ నియంత పాలనే కారణమని వ్యాఖ్యానించారు సిపిఐ జాతీయ నేత కె నారాయణ.. సిపిై పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపకుండా వారు సెల్ఫ్ డిస్మిస్ అయ్యారంటూ కెసిఆర్ ప్రకటిచండం అనైతికమని అన్నారు..

ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడటం చాలా బాధాకరమని  అన్నారు. తెలంగాణ సాధనలో కార్మికుల పోరాటం మరువలేనిదని చెప్పారు. నియమించిన తాత్కాలిక కార్మికులు, ఆర్టీసీ కార్మికుల మధ్య అంతర్యుద్ధం నడుపుతున్నారని నారాయణ ఆరోపించారు. ఆర్టీసీ కార్మికులంతా ధైర్యంగా ఉండాలని ఆయన కోరారు.

మృతిచెందిన ఒక్కో కార్మికుడి కుటుంబానికి ప్రభుత్వం రూ.కోటి చొప్పున నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. మృతుల పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగం, ఉండేందుకు సొంత ఇల్లు ఇవ్వాలన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విద్యాశాఖపై జగనన్న ముద్ర.. మంత్రి ఆదేశాలు