Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సీఎం కేసీఆర్ బృందంలో సినీ నటుడు ప్రకాష్ రాజ్

Advertiesment
సీఎం కేసీఆర్ బృందంలో సినీ నటుడు ప్రకాష్ రాజ్
, సోమవారం, 21 ఫిబ్రవరి 2022 (18:55 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బృందంలో సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఉంటున్నారు. ఇది ఇపుడు చర్చనీయాంశంగా మారింది. ఆదివారం సీఎం కేసీఆర్ చేపట్టిన ముంబై పర్యటనలోనూ ప్రకాష్ రాజ్ ప్రత్యేక ఆకర్షణగా ఉన్నారు. 
 
కాగా, ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ప్రతిపక్ష నేతలను ఏకం చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం ఆయన బీజేపీయేతర విపక్ష నేతలతో వరుసగా భాటీ కావాలని నిర్ణయించారు. 
 
ఇందులోభాగంగా, ఆదివారం ప్రత్యేకంగా ముంబైకు వెళ్లిన సీఎం కేసీఆర్.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో ప్రత్యేకంగా లంచ్ మీటింగ్ నిర్వహించారు. ఇందులో ప్రత్యేక ఆకర్షణంగా సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఉండటం గమనార్హం. 
 
ఈ భేటీ ఠాక్రే అధికారిక నివాసమైన వర్ష బంగ్లాలో జరిగింది. దాదాపు 2 గంటల పాటు భవిష్యత్ రాజకీయాలు, ప్రస్తుత రాజకీయాలతో పాటు కేంద్ర ప్రభుత్వ విధానాలపై సుధీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశానికి ప్రకాష్ రాజ్ రావడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. 
 
ఆ తర్వాత రాత్రికి ఆయన ముంబైకు చేరుకోనున్నారు. సీఎంతో పాటు.. ముంబైకు వెళ్లిన బృందంలో ఎంపీలు సంతోష్ కుమార్, రంజిత్ రెడ్డి, బీబీ పాటిల్, ఎమ్మెల్సీలు కవిత, పల్లా రాజేశ్వర్ రెడ్డి, తెరాస ప్రధాన కార్యదర్శి శ్రవణ్ కుమార్ తదితరులు ఉన్నారు.
 
మ‌హారాష్ట్ర సీఎం ఉద్ధ‌వ్ ఠాక్రేతో స‌మావేశ‌మైన ముఖ్య‌మంత్రి కేసీఆర్ బృందం.. ఈ సందర్భంగా భవిష్యత్‌ రాజకీయాలు, ప్రస్తుత రాజకీయాలతో పాటు కేంద్ర ప్ర‌భుత్వ విధానాల‌పై ఇద్ద‌రు సీఎంలు చ‌ర్చించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీకి కేంద్రం నుంచి వరదలా నిధులు, కానీ ఆర్థికంగా ఏపీ దివాళా ఎందుకు తీస్తుంది?