Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇంట్లో సీమంతం ఎవరికో తెలిస్తే షాకవుతారు..?

Advertiesment
ఇంట్లో సీమంతం ఎవరికో తెలిస్తే షాకవుతారు..?
, బుధవారం, 3 ఫిబ్రవరి 2021 (12:53 IST)
dog
ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లిలో ఓ ఇంట్లో సీమంతం జరిగింది. ఇందులో కొత్తేముంది అనుకుంటే పొరపాటే. కొత్త కాదు వింత దాగుంది. ఆ ఇంట్లో సీమంతం జరిగింది మహిళకు కాదు. ఓ పెంపుడు కుక్కకు. మనిషికి నిజమైన, విశ్వాసపాత్రమైన నేస్తాలు కుక్కలే. కొంతమంది పెంపుకు జంతువులను కన్నబిడ్డల కంటే ఎక్కువగా చూసుకుంటూ ఉంటారు. 
 
ఇలానే సత్తుపల్లిలోని ఓ కుటుంబం కూడా వారి ఇంట్లోని పెంపుడు కుక్కను కన్నబిడ్డలా చూసుకున్నారు. పెంపుడు కుక్క గర్భం దాల్చడంతో దానికి అంగరంగ వైభవంగా సీమంతం నిర్వహించారు. 
 
చుట్టుపక్కల వాళ్ళను పిలిచి వాయినాలు అందించి, సీమంతం పాటలు పాడి అచ్చంగా మనుషులకు ఎలాగైతే ఈ వేడుక చేస్తారో అలానే చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశంలో మళ్లీ పెరిగిన కోవిడ్.. కొత్తగా 11,039 కేసులు